ప్రస్తుతం టెక్నాలజీ వాడుకలో మనం దూసుకోపుతున్నాం. అయితే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నా టెక్నాలజీ వస్తువలు.. ఆధునిక సాంకేతికత గురించి మన పెద్దవారికి అంతగా తెలియదు. ముఖ్యంగా బామ్మ, తాతయ్యలకు వీటి గురించి అస్సలు తెలియదు. కొన్ని సందర్బాల్లో వారు ఇతర టెక్నాలజీ వస్తువలతో ప్రవర్తించే తీరు నవ్వులు పూయిస్తుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల బామ్మలు, తాతాయ్యలు ఆధునిక సాంకేతిక వస్తువులతో ప్రవర్తించే వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. అది కూడా అలెక్సాతో ఓ బామ్మా మాట్లాడిన మాటలు వింటే మీరు నవ్వకుండా ఉండలేరు.
ఆ వీడియోలు .. ఓ ఇంట్లో అలెక్సాలో పాటలు ప్లే అవుతున్నాయి. అయితే అక్కడే ఉన్న బామ్మా వచ్చి.. ఆ అలెక్సాతో గణపతి భజన చేయాలని కోరింది. అంతేకాదు.. కేవలం దేవుడి పాటలు మాత్రమే పాడాలని ఆ అలెక్సాను ఆదేశించింది. ఈ వీడియోను నేహ శర్మ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. మా బామ్మా.. అలెక్సాతో ఎలా మాట్లాడుతుంది. దానిని ఆదేశిస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 72,270కె లైక్స్ వచ్చాయి. ఈ ఫన్నీ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ ఇస్తున్నారు.
ఇన్స్టా పోస్ట్..
Tollywood Drugs Case: ముగిసిన తరుణ్ విచారణ.. 7 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు..