Barefoot Bookseller: అందమైన దీవిలో పుస్తకాల అమ్మకం.. నెలకు జీతం రూ. 59 వేలు.. కండిషన్స్ అప్లై

Updated on: Oct 11, 2022 | 8:19 PM

మాల్దీవులలోని ఒక విలాసవంతమైన ద్వీపంలో, ఒక పుస్తక విక్రేతకు పుస్తకాలు అమ్మే ఉద్యోగం వచ్చింది, అందులో $750 అంటే నెలకు దాదాపు 59 వేల రూపాయలు జీతంగా ఇస్తున్నారు. అల్టిమేట్ లైబ్రరీ లో ఉద్యోగం చేయాలంటే.. కొన్ని స్పెషల్ కండిషన్స్ కూడా ఉన్నాయి

1 / 5
దీవి అనగానే వెంటనే ఇండోనేషియాలోని బాలి, మాల్దీవులు వంటి అందమైన దీవులు మనసులో మెదులుతాయి. వీటిని చాలా మంది ప్రజలు సందర్శించాలని కలలుకంటూ ఉంటారు. వీటిని ప్రపంచంలో అత్యంత అందమైన ద్వీపాలు అని పిలుస్తారు. ఈ ద్వీపాలను సందర్శించే పర్యాటకులు దీవుల్లోని అందాలను ఎంతగానో ఇష్టపడతారు. అక్కడ నుంచి తిరిగి స్వగ్రామానికి వెళ్లాలంటే కూడా చాలా కష్టంగా భావిస్తారు. అలనాటి ఈ దీవులను పర్యాటకుల్లా కాకుండా.. మంచి జీతం వచ్చే ఉద్యోగం సంపాదించి అక్కడే ఉండిపోతే.. ఆ ఊహే సూపర్బ్ అనిపిస్తుందిగా.. అవును మంచి జీతంతో ఉద్యోగం, దీవిలో నివసించడానికి, పని చేయడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. మాల్దీవుల్లోని అద్భుతమైన ద్వీపంలో ఇలాంటి ఉద్యోగం ఇస్తున్నారు.

2 / 5
వాస్తవానికి, మాల్దీవుల విలాసవంతమైన ద్వీపంలో, పుస్తకాలు అమ్మే ఉద్యోగం ఉంది.ఈ ఉద్యోగం చేసేవారికి $ 750 అంటే నెలకు దాదాపు భారతీయ కరెన్సీలో రూ. 59 వేలను జీతంగా ఇస్తున్నారు. ఈ ప్రత్యేకమైన పనిని అల్టిమేట్ లైబ్రరీ చేపట్టింది.

3 / 5
లైబ్రరీ సేల్స్ మేనేజర్ అలెక్స్ మెక్ క్వీన్ ప్రకారం, అతను పుస్తకాలను అమితంగా ఇష్టపడే, ప్రయాణాలను ఇష్టపడే వ్యక్తి కోసం చూస్తున్నాడు. ఈ ఉద్యోగం ఏడాది పాటు కాంట్రాక్ట్‌పై చేయాల్సి ఉంది. ఇందులో ఉద్యోగి వివిధ దీవులకు వెళ్లి పుస్తకాలు విక్రయించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

4 / 5
గార్డియన్ నివేదిక ప్రకారం, ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి ఉచిత వసతి, ఆహారం వంటి అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వబడతాయి. దీనితో పాటు ఆ ఉద్యోగి జిమ్, స్పా , వాటర్‌స్పోర్ట్‌లను కూడా ఉచితంగా ఆస్వాదించవచ్చు. అక్టోబరు నుంచి ఉద్యోగ ఒప్పందం ప్రారంభమవుతుందని.. ఇది ఏడాది పాటు కొనసాగుతుందని చెబుతున్నారు.

5 / 5
అయితే ఈ లైబ్రెరీలో ఉద్యోగం చేయాలంటే.. కండిషన్స్ కూడా అప్లై అంటున్నారు. అవును ఈ ఉద్యోగానికి చాలా విచిత్రమైన షరతు ఉంది, దానిని అభ్యర్థి పాటించాల్సిందే. పుస్తకాలను అమ్మే వ్యక్తి.. సముద్ర తీరంలో కాళ్లకు బూట్లు, చెప్పులు ధరించకూడదు. వాస్తవానికి, మాల్దీవుల్లోని అన్ని బీచ్‌లలో కాళ్లకు పాదరక్షలు ధరించకూడదనే కండిషన్ ఉంది. అదే ఈ ఉద్యోగంలో కూడా అమలు చేస్తున్నారు. ఈ షరత్ ను పెట్టారు.