
సోషల్ మీడియా అనేది ఎన్నో రకాల వైరల్ వీడియోలకు వేదిక. ఈ క్రమంలోనే ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన తర్వాత మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. వైరల్ వీడియోలో ఓ బైకర్ ఆగివున్న భారీ కంటైనర్ కింద నుండి తన బైక్‌తో పాటు వెళ్లటం కనిపిస్తుంది. అతడు రోడ్డుపై ఆగివున్న ట్రక్కు కింద నుండి బైక్‌తో పాటు బయటకు వెళ్లాడు. అంతేకాదు..ఇదంతా వీడియో తీసిన వ్యక్తి ఇలా ఎందుకు చేశావని అడిగినప్పుడు, అతను నవ్వుతూ భలే సమాధానం చెప్పాడు. తాను ఒక కళాకారుడిని అంటూ చెప్పాడు.
ఈ వీడియో @sarviind అనే ఖాతా నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది. 56 సెకన్ల ఈ వైరల్ వీడియోలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అన్ని భారీ వాహనాలే లారీలు, భారీ ట్రక్కులు రోడ్డుపై బారులు తీరి ఆగిపోయి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి ట్రక్కు కింద నుండి తన బైక్‌ను బయటకు తీస్తుండటం కనిపించింది. అది చూసిన కొందరు స్థానికులు ఇదంతా వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ట్రక్కు కింద నుంచి బైక్‌ను బయటకు తీస్తుంటే, అతని పక్కనే నిలబడి ఉన్న మరొక వ్యక్తి అతన్ని వీడియో తీస్తున్నాడు. అందులో అతను నవ్వుతూ భోజ్‌పురిలో ట్రక్కు కింద నుంచి బయటకు వస్తున్నాడని, ఇది బీహార్. ఏదైనా జరగవచ్చని అంటున్నాడు. వీడియో తీస్తున్న వ్యక్తి బైక్ నడుపుతున్న వ్యక్తిని మీరు ఏం చేస్తున్నారని అడిగితే, ఇది బీహార్, ఇక్కడ కళాకారులకు కొరత లేదు” అంటూ అతను సమాధానం చెప్పుకొచ్చాడు. అప్పుడు వీడియో కెమెరా పట్టుకున్న వ్యక్తి ఇది బీహార్ కళాకారుల భూమి అని అంటాడు.
వీడియో ఇక్కడ చూడండి..
बिहार का नाम बदनाम करने वाले इन नमूनों का, क्या ही किया जाए?
चालू ट्रक के नीचे से बाइक निकाल रहा है। खुद को कलाकार बताता हुआ हंस रहा है। pic.twitter.com/GJPASqPvYD— Arvind Sharma (@sarviind) November 9, 2025
అయితే, వీడియో క్యాప్షన్‌లో మాత్రం ఇలా ఉంది..బీహార్ కు చెడ్డపేరు తెస్తున్న ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? అతను రోడ్డుపై ఆగివున్న ట్రక్కు కింద నుండి బైక్‌తో సహా రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. పైగా అదేంటని అడిగితే వెటకారంగా సమాధానం చెబుతున్నాడు అని రాసి వుంది. అయితే, వీ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. తను బీహార్ కు చెందిన వాడు.. ఏదైనా చేయగలడు. అతను రిస్క్ లకు భయపడడు అని రాశారు. మరొకరు ఇలాంటి రిస్క్ లు ఎప్పుడూ చేయకూడదని అంటున్నారు. సదరు వ్యక్తి బైక్ ను జప్తు చేయాలి..అప్పుడు అతను జీవితాంతం ఇలాంటి రెడ్ లైట్ క్రాస్ చేయాలంటే భయపడతాడు అని రాశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల 45 వేలకు పైగా చూశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…