ఈ మధ్య కాలంలో ప్రేమ అంటే ఏమిటో తెలియని చిన్న పిల్లలు కూడా ప్రేమలో పడిపోతున్నారు. ఇక ఆ వెంటనే బ్రేకప్ కూడా చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే కదా సమాజంలో ట్రెండ్. ఇలాంటి చిన్న పిల్లలను మీరు కూడా చూసే ఉంటారు కదా..! అలాగే మన ఫ్రెండ్స్‌లో కూడా లవ్ ఫెయిల్యూవర్స్ ఉంటారు. కొన్ని సందర్భాలలో వారికి ప్రేమ కలిగిన నష్టాన్ని లేదా, తమ ప్రేయసి గురించి చెప్పి మన దగ్గర బాధపడుతుంటారు. అయితే ఇప్పుడు చిన్న వయసులోనే లవ్ ఫెయిల్యూవర్‌గా మారిన ఓ చిన్న పిల్లవాడి బాధకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఆ అమ్మాయే కావాలి. ఇంకో అమ్మాయి వద్దంటే వద్దు. ఇంకో అమ్మాయిని ప్రేమించడం కంటే చనిపోతా, అంతేకానీ నాకు ఎవరు వద్దు. నాకు ఆ అమ్మాయే కావాలి’ అంటూ ఆ చిన్న పిల్లవాడు బాధతుంటాడు. ఈ క్రమంలో అతన్ని కొందరు యువకులు, చిన్న పిల్లలు బాధపడవద్దంటూ వారిస్తుంటారు. కానీ అతను ఆపకుండా బాధపడుతూనే ఉంటాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను కదిలిస్తుంది. ఎలా అంటే వాళ్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ‘ఇంత చిన్న వయసులో నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎవర్రా బాబు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఒక నెటిజన్ అయితే తన ఫ్రెండ్‌ని మెన్షన్ చేసి ‘నువ్వు కూడా ఇలాగే చేస్తుంటావు’ కదా అని రాసుకొచ్చాడు.
నెట్టింట బాధపడుతున్న లవ్ ఫెయిల్యూవర్ వీడియోను ఇక్కడ చూడండి…
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..