Viral News: రోడ్డుపై నోట్ల జాతర.. ఎగబడి జేబులు నింపుకున్న జనం.. ఇద్దరు అరెస్ట్ .. ఎక్కడంటే..

Viral Video: ఇప్పటి వరకూ మనం కప్పల వర్షం, చేపల వర్షం చూశాం. కానీ ఇప్పుడు అక్కడ రోడ్డుపై నోట్ల వర్షం కురిసింది. ఆ నోట్ల కోసం జనం ఎగబడ్డారు. ఎంత ఏరినా తరగని..

Viral News: రోడ్డుపై నోట్ల జాతర.. ఎగబడి జేబులు నింపుకున్న జనం.. ఇద్దరు అరెస్ట్ .. ఎక్కడంటే..
Viral Video

Updated on: Nov 21, 2021 | 9:12 AM

Viral News: ఇప్పటి వరకూ మనం కప్పల వర్షం, చేపల వర్షం చూశాం. కానీ ఇప్పుడు అక్కడ రోడ్డుపై నోట్ల వర్షం కురిసింది. ఆ నోట్ల కోసం జనం ఎగబడ్డారు. ఎంత ఏరినా తరగని నోట్లను జేబుల్లో నింపుకునేందుకు జనం పోటీపడ్డారు. అమెరికాలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఫ్రీవే రహదారి డాలర్లతో నిండిపోయింది. నవంబరు 19 శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగిన ఈ సంఘటన చూసి జనం ఆశ్చర్యపోయారు. అంతేకాదు రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు, ఒకరితో ఒకరు పోటీ పడుతూ జేబుల్లో నింపుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

శాన్‌డిగో నుంచి కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి డబ్బు సంచులతో బయలుదేరిన వాహనం తలుపు మార్గమధ్యంలో అకస్మాత్తుగా తెరుచుకుంది. కొన్ని సంచులు కిందపడి పోయాయి. వాటిలోని డబ్బులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన వాహనదారులు గబ గబా వాహనాలు దిగి వెళ్లి వాటిని జేబుల్లో వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువైపులా రోడ్డును దిగ్బంధించారు. వాహనదారులను అడ్డుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించడంతో కొందరు ఇచ్చేశారు. చాలామంది అక్కడి నుంచి జారుకున్నారు. డెమీ బాగ్బీ అనే బాడీ బిల్డర్‌ ఈ దృశ్యాలన్నీ ఫోన్‌లో చిత్రీకరించి, ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఎన్ని డబ్బులు పోయాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read:

షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం.. పంచదార బదులు దీని ఆకులను వాడితే ఎంతో మేలంటున్న ఆయుర్వేదం