జర్మనీలోని లూడెన్షిడ్ ప్రాంతలో 450 మీటర్లున్న బ్రిడ్జిని ఆదివారం నెలమట్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే 1965, 1968 మధ్య కాలంలో ఈ వంతెనను నిర్మించారు. అయితే దీనికి పగుళ్లు రావడంతో 2021 డిసెంబర్‌లో మసేశారు. అప్పటినుంచి ఏ వాహనాలు ఆ బ్రిడ్జి పై నుంటి వెళ్లడం లేదు. ఇక దీనివల్ల ఉపయోగం లేదని తెలుసుకుని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు.దాదాపు 150 కిలోల పేలుడు పదార్థాలతో వినియోగించి ఎట్టకేలకు ఆదివారం బ్రిడ్జిని విజయవంతంగా కూల్చివేశారు. అలాగే చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే ఈ వంతెనను కూల్చిన వెంటనే దానికి దూరంలో ఉన్న కొంతమంది స్థానికులు కేరింతలతో చప్పట్లు కొట్టారు. కొన్ని సెండ్లలోనే కూలిపోయిన ఈ వంతెన వీడియో ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే త్వరలోనే అక్కడ ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త వంతెనను నిర్మిస్తామని అధికారులు తెలిపారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి 5 ఏళ్లు సమయం పడుతుందని వెల్లడించారు.
A45 in Sauerland, Germany ??: ailing Rahmede motorway bridge was sucessfully blown up today.
Boom ? pic.twitter.com/3pkznmqszd— LX (@LXSummer1) May 7, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..