Viral Video: నడుస్తుండగానే పిడుగు పడింది.. అంతా చనిపోయాడనుకున్నారు.. కానీ..

సాధారణంగా ఎత్తైన ప్రదేశాల్లో, చెట్లపై పిడుగులు పడతాయి. చాలా మంది వర్షం వస్తున్నప్పుడు చెట్ల కిందికి వెళ్తారు.

Viral Video: నడుస్తుండగానే పిడుగు పడింది.. అంతా చనిపోయాడనుకున్నారు.. కానీ..
Thunderbolt

Updated on: Dec 27, 2021 | 12:11 PM

సాధారణంగా ఎత్తైన ప్రదేశాల్లో, చెట్లపై పిడుగులు పడతాయి. చాలా మంది వర్షం వస్తున్నప్పుడు చెట్ల కిందికి వెళ్తారు. కానీ ఇది ప్రమాదకరం. ఎందుకంటే ఉరుములు, మెరుపులతో వర్షం వచ్చినప్పుడు చెట్ల కింద ఉంటే పిడుగులు పడే అవకాశం ఉంటుంది. కానీ ఓ చోట నడుస్తున్న వ్యక్తిపైనే పిడుగు పడింది.

ఇండో‎నేషియాలోని జకార్తాలో ఓ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. ఓ వ్యక్తి ఆ వర్షంలో గొడుకు పట్టుకుని నడుస్తున్నాడు. సడెన్‎గా అతను కాలిపోతున్నట్లు కనిపించాడు. అంటే అతనిపై పిడిగు పడిందని అర్థం అయింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

Read Also.. Viral Video: నాతోనే గేమ్సా.. వేటాడేందుకు వచ్చిన పులితో దాగుడుమూతలు ఆడిన బాతు..! వీడియో వైరల్

Viral Video: వేగంగా దూసుకొచ్చిన రైలు.. పట్టాలపై ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వైరల్‌ వీడియో..