ఈ రోజుల్లో సోషల్ మీడియా పూణ్యమా అని వింతైన ఫన్నీ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. నెటింట్లో ఫేమస్ కావాలని కుర్రకారు వివిధ ప్రయోగాలు చేస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షించడానికి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. రీల్స్‌లో కూడా సినిమా ట్వీస్ట్‌లతో కొందరు ఆకట్టుకుంటున్నారు. ఇలా ఎవరి పర్ఫామెన్స్‌తో వారు నెటిజన్లను నవ్వించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో యువతి తన లవర్ ఆచూకీ చెప్పమని ఓ కర్ర తీసుకొని వచ్చి వాళ్ల ఫ్రెండ్‌ను బెదిరిస్తుంది. లాస్ట్‌కి ఏమైంది?.. తన లవర్ ఆచూకీ దొరికిందా?
మొదట ఓ యువతి చెరువు దగ్గరికి కర్ర తీసుకొని వస్తుంది. అక్కడే ఉన్న తన లవర్ ఎక్కడ ఉన్నాడని అతన్ని ఆచూకీ చెప్పాలని ఫ్రెండ్‌ను బెదరిస్తుంది. దీంతో అతను బెదిరిపోయి..తన ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో చెబుతాడు. ఆమె నీటిలోకి వెళ్లి అతన్ని జుట్టు పట్టుకొని బయటకు తీసుకువస్తుంది. తన లవర్ భయంతో బయటకు వస్తాడు. ఈ వీడియో చూస్తుంటే ముందే వారు ప్లాన్ చేసుకున్నట్లు అర్ధమవుతుంది. ఈ వీడియోపై నెటిజన్స్ రకరకలుగా స్పందిస్తున్నారు. అంతా ప్లాన్ ప్రకారం వీడియో చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అబ్బాయిలు జర జాగ్రత్త.. లేకుంటే ఇలానే దొరికిపోతారు అని కామెంట్స్ చేస్తున్నారు