Dance Video: హీరోల కంటే తీసిపోని డ్యాన్స్ ఇది..! చూస్తే ఎంతటివారైనా ‘ఇదేం డ్యాన్సురా అయ్యా..!’ అనాల్సిందే..

|

Jan 29, 2023 | 1:16 PM

అభివృద్ధి చెందిన టెక్నాలజీ, అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ కారణంగా దేశంలోని చాలా మంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే అనేక మంది సోషల్ మీడియా వేదికగా బాగా ఫేమస్..

Dance Video: హీరోల కంటే తీసిపోని డ్యాన్స్ ఇది..! చూస్తే ఎంతటివారైనా ‘ఇదేం డ్యాన్సురా అయ్యా..!’ అనాల్సిందే..
Boy Dance Video
Follow us on

అభివృద్ధి చెందిన టెక్నాలజీ, అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ కారణంగా దేశంలోని చాలా మంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే అనేక మంది సోషల్ మీడియా వేదికగా బాగా ఫేమస్ కూడా అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడయోలలో డ్యాన్స్ వీడియోలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకు కారణం మన దేశంలో చాలా మంది డ్యాన్స్, మ్యూజిక్‌ని ఎక్కువగా ఇష్టపడుతుండడమే. అందుకే డ్యాన్స్ వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. అయితే అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ అయిన ఆ వీడియోను చూస్తే మతి పోవాల్సిందే. అందులో డ్యాన్స్ వేస్తున్న బాలుడి స్టెప్పులను చూస్తే డ్యాన్స్ మ్యాస్టర్స్‌ అయినా ఆశ్చర్యపోవాల్సిందే.

sanchitstyle_fp అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడి నుంచి షేర్ అయిన ఆ వీడియోలో ఒక బాలుడు టిప్‌టాప్‌గా సూట్‌లో ఉండడాన్ని మనం చూడవచ్చు. డ్యాన్స్ ఫ్లోర్‌లో సంగీతంతో బాలుడు రిథమ్‌లో ఎలా డ్యాన్స్ చేస్తున్నాడనేదాన్ని కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. అతని పాదాలు మెరుపు వేగంతో కదులుతున్నాయి. అసలు అలాంటి డ్యాన్స్ ఒక బాలుడు చేస్తున్నాడంటే నమ్మశక్యం కానీ విషయం కూడా. కానీ నమ్మక తప్పదు. అందుకే అనుకుంటా ఆ బాలుడి వెనుక ఉన్న అమ్మాయిలు కూడా అతడిని చూసి వావ్ అనకుండా ఉండలేకపోయారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియోను ఇక్కడ చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..