Viral Video: బావతో మరదలి సరదా.. బాలీవుడ్ పాటకు ఓ రేంజ్‌లో స్టెప్పులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా ఉంటాయి.

Viral Video: బావతో మరదలి సరదా.. బాలీవుడ్ పాటకు ఓ రేంజ్‌లో స్టెప్పులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
Dance Video

Updated on: Jul 09, 2021 | 3:33 PM

Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా ఉంటాయి. ప్రాంక్ వీడియోలు, కామెడీ వీడియోలు, సరదా డ్యాన్స్‌లు ఇలా రకరకాల వీడియోలు నిత్యం చక్కర్లు కొడుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలో ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. ఓ వీడియోలో ఓ మహిళ తన బావతో సరదాగా డ్యాన్స్ వేసింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఈ జంట.. బాలీవుడ్ సినిమాలోని ఓ సాంగ్‌కు స్టెప్పులేశారు.

ఈ వీడియోలో మహిళ పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ.. తన భావతో సరదాగా డ్యాన్స్ చేసింది. అతను కూడా తన వంతు ప్రయత్నం పాటకు తగ్గట్లుగా హావభావాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నాడు. అయితే, ఈ వీడియోను సదరు మహిళ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘నా ప్రియమైన బావతో డ్యాన్స్’ అంటూ క్యాప్షన్ పెట్టి ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో రెస్పాండ్ అవుతున్నారు. వారి డ్యాన్స్‌పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోను ఇప్పటి వరకు 25 వేల మందికిపైగా లైక్ చేశారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ డ్యాన్స్‌ను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Microsoft Bonus: ఉద్యోగులకు బంపరాఫర్‌ ఇచ్చిన మైక్రోసాఫ్ట్‌.. ఎంప్లాయిస్‌ కృషికి గుర్తుగా భారీగా బోనస్‌. ఎంతో తెలిస్తే..

AP CM: బద్వేల్ నియోజయకవర్గానికి ఎప్పుడూ మంచి జరగలేదు : సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి

Dwaraka Tirumala: పుణ్యక్షేత్రంలో పందుల స్వైరవిహారం.. ద్వారక తిరుమలలో భక్తుల అగచాట్లు.. పట్టించుకోని అధికారులు