Viral Video: సరస్సు ఒడ్డున కూర్చుని గిటార్ ప్లే చేస్తుండగా దూసుకొచ్చిన పాము.. కట్ చేస్తే..

|

May 15, 2024 | 7:24 PM

పాము కనపడితే ఎవరైనా అక్కడి నుంచి పరారవుతారు. ధైర్యం ఉన్నవారు దాన్ని కొట్టి చంపుతారు. వన్యప్రాణుల ప్రేమికులు అయితే.. స్నేక్ క్యాచర్‌కు సమాచారాం ఇస్తారు. ఇతను ఏం చేశాడో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.....

Viral Video: సరస్సు ఒడ్డున కూర్చుని గిటార్ ప్లే చేస్తుండగా దూసుకొచ్చిన పాము.. కట్ చేస్తే..
Snake
Follow us on

ఆస్ట్రేలియా ప్రజలు ప్రకృతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. అడవుల పట్ల గొప్ప ప్రేమను కలిగి ఉంటారు. వన్యమృగాల సంరక్షణ కోసం తమ వంతు కృషి చేస్తూ ఉంటారు. వారు చేసే పనుల్లో కూడా ఆ ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఆస్ట్రేలియన్ యువకుడు సరసు ఒడ్డున కూర్చుని గిటార్ ప్లే చేస్తుండగా.. నీటి గుండా ఆ పాము అతని వద్దకు దూసుకువచ్చింది. ఆ  సమయంలో అతని రెస్పాన్స్ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మిల్లర్ విల్సన్ అనే యువకుడు.. సరస్సు పక్క ఉన్న ఓ రాయిపై కూర్చుని.. తన కాళ్లను నీటిలో ఉంచి.. గిటార్ వాయిస్తూ ప్రకృతిని ఎంజాయి చేస్తున్నాడు. ఈ సమయంలో నీటిలో నుంచి ఒక పాము అతని వద్దకు ఈదుతూ వచ్చింది. సరాసరి వచ్చి అది అతని కాళ్లను తాకింది కూడా. కొన్ని సెకన్ల పాటు అది అక్కడే ఉంది. అలా పాము దగ్గరకు వస్తూ.. ఎవరైనా సరే అక్కడి నుంచి పరుగులు పెడతారు. భయంతో దౌడు తీస్తారు. కానీ మిల్లర్ విల్సన్ మాత్రం భయపడటానికి బదులుగా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. పాగా ఆ పాము వెళ్లిపోతున్నప్పుడు దాని శరీరాన్ని పామాడు కూడా.

వీడియోను దిగువన చూడండి…

మిల్లర్ ప్రవర్తనపై నెటిజన్లు ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అది ఎలాంటి టఫ్ సిట్యువేషన్ అయినా కూల్‌గా హ్యాండిల్ చేస్తే నువ్వు కింగు.. దానికి ఈ వీడియో ఎగ్జాంపుల్ అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. “కొంపతీసి ఆ పాము నీకు పెట్ కాదు కదా!!” అని యూజర్ వ్యాఖ్యానించాడు. “నీ ధైర్యానికి సెల్యూట్ బ్రదర్. ఇలా ఎలా” అని మరొకరు ఆశ్చర్యపోయారు. “అతను గిటార్ ట్యూన్ వైబ్రేషన్‌ పామును ఆకర్షించి ఉంటుంది. ఇది అందమైన వీడియో” అని మరొక వ్యక్తి అభిప్రాయపడ్డాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..