Watch Video: టీ కోసం ట్రైన్ దిగిన ప్రయాణికుడు.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. ఏం జరిగిందంటే?

ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడికి షాకింగ్ ఘటన ఎదురైంది.. ట్రైన్ ఒక స్టేషన్‌లో ఆగినప్పుడు అతను టీ తాగేందుకు ట్రైన్ దిగాడు.. అయితే టీ తాగుతుండగా.. ట్రైన్ స్టార్ట్‌ అయ్యింది. దీంతో వెంటనే అతను టీ పడేసి ట్రైన్ ఎక్కేందుకు పరుగులు పెట్టాడు.. కానీ ట్రైన్ డోర్స్ అటోమేటిక్‌గా లాక్‌ అయిపోయాయి. అతనికి అప్పుడు గుర్తొంచ్చింది తాను ప్రయాణిస్తున్నది.. ప్యాసింజర్ ట్రైన్‌ కాదు వందే భారత్‌ అని ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: టీ కోసం ట్రైన్ దిగిన ప్రయాణికుడు.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. ఏం జరిగిందంటే?
Vande Bharat Express

Edited By:

Updated on: Nov 01, 2025 | 7:24 PM

సాధారణంగా ప్యాసింజర్‌ ట్రైన్‌లో అయితే అది బయల్దేరే ముందు మనం రన్నింగ్‌ చేజ్ చేసి అయినా దాన్ని ఎక్కవచ్చు. కానీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ట్రైన్స్‌ను స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత ఎక్కడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ట్రైన్‌ స్టార్ట్ అయ్యే ముందే వాటి డోర్స్‌ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఏదైనా రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ ఆగిన వెంటనే ప్రయాణీకుడు దిగితే, అది చాలా ప్రమాదకరం. ఒక వేళ దిగినా.. డోర్స్‌ క్లోజ్ అయ్యేలోపు అతను ట్రైన్‌ ఎక్కాలి లేదంటే.. ట్రైన్‌ మిస్సైనట్టే.. ఎందుకంటే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ట్రైన్స్‌ ఖచ్చితమైన సమయపాలన పాటిస్తాయి. ఈ విషయం తెలియక టీ కోసం ట్రైన్‌ దిగిన ఒక ప్రయాణికుడు చిక్కుల్లో పడ్డాడు.

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ప్రకారం.. వందేభారత్‌ ట్రైన్‌లో ప్రయాణికున్న ఒక వ్యక్తి.. ట్రైన్‌ స్టేషన్‌లో ఆగినప్పుడు.. దిగి టీ తాగుతున్నాడు. అప్పుడే ట్రైన్‌ స్టార్ట్ అయ్యింది. అది గమనించిన ఆ వ్యక్తి తన చేతిలో రెండు టీ కప్స్‌ను పట్టుకొని ట్రైన్ ఎక్కేందుకు డోర్ దగ్గరకు వెళ్లాడు. కానీ అంతలోపే ట్రైన్ డోర్స్ క్లోజ్అయ్యాయి. అయితే ట్రైన్‌ లోపల ఉన్న వ్యక్తి.. డోర్స్‌ ఓపెన్ చేస్తాడనే ఆశతో అతను.. డోర్ వద్దే నిల్చుని ఉన్నాడు. తర్వాత అది సాధ్యం కాదని అర్థం చేసుకొని.. వెంటనే తన చేతితో ఉన్న టీ కప్స్‌ను అక్కడే పడేసి.. పరుగులు పెట్టాడు.


@indian_railway_0542 అనే ఇన్‌స్ట్రాగ్రామ్ హ్యాండిల్ పోస్ట్ చేయబడిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 300,000 కంటే ఎక్కువ మంది చూశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ బాక్స్‌ను నింపేశారు. ఆ పేదవాడు ట్రైన్ మిస్ అయ్యాడు, దానికి తోడు ట్రైన్‌లోనే టీ దొరుకుతుంది..కానీ అతను ట్రైన్ ఎందుకు దిగాడు అని కామెంట్‌ బాక్స్‌లో కొందరు అతన్ని విమర్శించారు. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే వ్యక్తులు ఇలాగే ఉంటారని మరొక యూజర్ కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.