
పోలీసుల వివరాల ప్రకారం.. హాపుర్ జిల్లా పిల్ఖువా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన యువతి గౌతమ్ బుద్ధ నగర్‌లోని దాద్రికి చెందిన యువకుడిని కొద్ది నెలల క్రితం మ్యారేజ్ చేసుకుంది. వివాహానంతరం చిన్నచిన్న కారణాలతో వారి మధ్య విభేదాలు తలెత్తడంతో.. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తాజాగా భర్తపై పిల్ఖువా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. భార్యాభర్తలిద్దరినీ కౌన్సిలింగ్ కోసం పోలీసుల వద్దకు పిలిపించగా.. ఆమె తెలిపిన కారణాలు పోలీసులను ఆశ్చర్యపరిచాయి.
భర్త వెర్షన్ విషయానికి వస్తే.. భార్య ఇంటి పనులు చేయకుండా ఎప్పుడూ రీల్స్ తీస్తూ బిజీగా ఉంటుందట. ఫాలోవర్స్ తగ్గినప్పుడల్లా తనకు ఫుడ్ కూడా పెట్టడం లేదని భర్త ఆరోపించాడు. ఇక భార్య వెర్షన్‌కు వస్తే.. భర్త తరచూ ఇంటి పనులు చేయమని చెబుతుంటాడని.. ఆ సమయంలో రీల్స్ అప్‌లోడ్ చేయలేక తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు ఫాలోవర్స్ తగ్గారని తెలిపింది. సుమారు 3-4 గంటల కౌన్సిలింగ్ తర్వాత భార్య భర్తకు రోజూ రెండు రీల్స్ మాత్రమే చేస్తానని హామీ ఇచ్చింది. భర్త కూడా అందుకు అంగీకరించాడు.
“సోషల్ మీడియాలో భార్య ఎక్కువ సమయం గడపడం.. ఇంటి పనులు పట్టించుకోకపోవడం వల్ల గొడవలు జరిగినట్లు తెలిసింది. కౌన్సిలింగ్ అనంతరం ఇద్దరూ తమ తప్పులను అంగీకరించి.. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు” అని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..