
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రీల్స్ చేస్తూ ఓ యువతి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బోండా ప్రాంతంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ 27 ఏళ్ల మహిళ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రీల్స్ చూసి.. తాను కూడా ఆ రీల్‌ను రీక్రియేట్ చేయాలనుకుంది. ఈ క్రమంలో రీల్ చేసేందుకు ప్రయత్నించింది. రీల్‌లో ఉన్న విధంగా స్టూల్ తీసుకొని ఉరివేసుకునే సీన్‌ను చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.
ఆమె స్టూల్‌పై ఎక్కి మెడకు తాడు బిగించుకున్న వెంటనే ప్రమాదవశాత్తు స్టూల్ బ్యాలెన్స్ తప్పి ఆమె కిందపడిపోయింది. దీంతో ఆమె గొంతుకు తాడు బిగుసుకుపో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఉన్న నాలుగేళ్ల చిన్నారి గమనించి కేకలు వేయడంతో స్థానికులంతా ఘటనా స్థలానిరి చేరుకొని ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెంది ఉండడంతో చేసేదేమి లేకా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టమ్ నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ఆధారంగా రీల్స్ చేసే క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాధమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటి సారి ఏం కాదు. గతంలో కూడా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి సీనే జరిగింది. శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఓ 14 ఏళ్ల బాలుడు రీల్స్ తీసే క్రమంలో ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మరణంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి మరీ బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.