
అరబ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని సంపన్నలు విలాసవంతమైన జీవనశైలి ప్రసిద్ధి. అదే విధంగా వారి పెంపుడు జంతువులను కూడా లగ్జరీగా పెంచుతుంటారు. వాటి యజమానుల మాదిరిగానే ఆయా పెంపుడు జంతువులు కూడా విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తాయి. చాలా మంది అరబ్ షేకులు గద్దలను పెంచుకుంటూ ఉంటారు. గద్దలతో అరబ్ షేక్ ఫోటోలను వీడియోలను మీరు కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసే ఉంటారు. అయితే తాజాగా యూఏఈ ఒక గద్దకు పాస్‌పోర్ట్ మంజూరు చేసింది.
ఒక యుఏఈ వ్యక్తి తన పెంపుడు గద్దకు పాస్‌పోర్ట్ తీసుకొని మొరాకో పర్యటనకు తీసుకెళ్లాడు. అబుదాబి విమానాశ్రయంలో యూఏఈలోని స్థానిక నివాసి చేతిలో గద్ద పట్టుకుని ఉండటాన్ని ఒక విదేశీ పర్యాటకుడు చూసి అతని దగ్గరికి వచ్చి, “ఈ గద్ద మీతో పాటు విమానంలో వస్తుందా?” అని అడిగాడు. గద్దకు పాస్‌పోర్ట్ ఉందా? అని అడిగాడు. “అవును, గద్దకు కూడా పాస్‌పోర్ట్ ఉంటుంది” అని ఆ వ్యక్తి చెప్పడమే కాకుండా.. ఆ పాస్‌పోర్ట్‌ను ప్రశ్న అడిగిన వ్యక్తికి చూపించాడు. ఆ పాస్ పోర్ట్ చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఈ వీడియో uaefalcons_ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై షేర్ అయింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి