ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!

Lion Viral Video: ఆ ఓనర్ ఉదయాన్నే యదేచ్చగా తన ఇంటి తలుపును తెరిచాడు. ఇక అతడికి డోర్ తీయగానే పెద్ద షాక్ తగిలింది. ఎదురుగా..

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!
Lions

Updated on: Apr 06, 2021 | 2:08 PM

Lion Viral Video: ఆ ఓనర్ ఉదయాన్నే యదేచ్చగా తన ఇంటి తలుపును తెరిచాడు. ఇక అతడికి డోర్ తీయగానే పెద్ద షాక్ తగిలింది. ఎదురుగా రెండు సింహాలు బావిపైన కూర్చుని ఉన్నాయి. ఇంకేముంది ఆ దృశ్యాన్ని చూసిన అతడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఈ ఘటన తాజాగా గుజరాత్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో రెండు సింహాలు ఓ ఇంటి గుమ్మంలో ఉన్న బావిపై కూర్చుని నీరు తాగుతున్నట్లు కనిపిస్తుంది. వాటిని చూసిన యజమాని లోపల నుంచి తన మొబైల్‌లో రికార్డు చేస్తూ డోర్ తీస్తాడు. అతడు భయం.. భయంగానే తలుపును తెరవగా.. ఆ సింహాలు రెండూ కూడా నీరు తాగి వెళ్ళిపోతాయి. ఈ వీడియోను సాకేత్ అనే వ్యక్తి పోస్ట్ చేసి.. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందాను ట్యాగ్ చేశాడు. దీనిని నెటిజన్లు విపరీతంగా రీ-ట్వీట్లు చేయడంతో పాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!

”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!

అద్భుత రికార్డు.. 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!

Shocking: మొక్క కాదు “యమపాశం’..తాకితే తగలబెడుతుంది.. అసలు ఎందుకో తెలుసా.?