
అడవికి రాజైన సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుంది. ఏ జంతువుపైన దాడి చేసినా.. దెబ్బకు క్షణాల్లో మట్టుబెడుతుంది. సింహం గర్జన వింటే చాలు చాలా జంతువులు భయంతో దాని కంటికి కనిపించనంత దూరానికి పారిపోతాయి. అంతటి బలశాలి అయిన సింహం కూడా గజగజలాడుతుంది. ఎందుకో మీకు తెలుసా.! మగ సింహం ఏదైనా కూడా ఆడ సింహానికి భయపడాల్సిందే.! తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా ఓ యువతి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్లాడుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇది జంతువులకు కూడా వర్తిస్తుందని కొన్ని వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి. ఇక్కడ ఓ ఆడ సింహం కోసం రెండు మగ సింహాలు భీకర యుద్ధం చేసుకున్నాయి.
ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. ఓ ఆడ సింహం.. మగ సింహం వెనక్కి వచ్చి దాక్కుంటుంది. ఇక ఆ ఆడ సింహం వెనుక వస్తోన్న మరో మగ సింహం ఒక్క ఉదుటన రెండో మగ సింహంపై దాడికి దిగుతుంది. ఇద్దరి మధ్య ఓ చిన్న సైజ్ యుద్ధం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.
Also Read: కళ్లతో కట్టిపడేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టారా!