Viral Video: అక్కడెలా కూర్చున్నావ్‌రా.. వంటపాత్రలో ఇరుక్కపోయిన బాలుడు.. ఎలా బయటకి తీశారో చూడండి

పిల్లలకు నడక వచ్చిందంటే చాలూ ఒక్క దగ్గర కుదరుగా ఉండరు. ఇంటిని పీకి పందిరేస్తారు. మొత్తం తిరుగుతూ అల్లరల్లరి చేస్తారు. కొన్ని సార్లు వారు చేసే తింగరి పనులతోనే సమస్యల్లో ఇరుక్కుంటారు. తాజాగా ఇక్కడో బుడ్డోడు కూడా అదే పని చేశాడు. ఆడుకుంటూ వంటపాత్రలో కూర్చొని ఇరుక్కుపోయాడు. గమనించిన పేరెంట్స్ చాలా సేపు కస్టపడి పిల్లాడిని అందులోంచి బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: అక్కడెలా కూర్చున్నావ్‌రా.. వంటపాత్రలో ఇరుక్కపోయిన బాలుడు.. ఎలా బయటకి తీశారో చూడండి
Kerala Boy Stuck In Cooking Pot

Updated on: Apr 24, 2026 | 1:18 PM

ఇంట్లో సరదాగా ఆడుకుంటూ ఓ 4 ఏళ్ల బాలుడు వంటపాత్రలో కూర్చొని ఇరుక్కుపోయిన ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మలప్పురం జిల్లాలోని మూకనాడు కల్చరల్ సెంటర్ సమీపంలో నివసించే అంబయతింగల్ సాదిక్ అనే వ్యక్తికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఇటీవలో ఇంట్లో ఆడుకుంటూ ఉన్న బాలుడి సరదాగా ఒక అల్యూమినియం వంట పాత్రలోకి కూర్చున్నాడు. అయితే, మళ్లీ లేద్దామని చూస్తే బాలుడికి బయటకు వచ్చేందుకు సాధ్యం కాలేదు. దీంతో ఆ బాలుడు ఆ పాత్రలోనే ఇరుక్కుపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని బయటకు తీసేందుకు విఫలయత్నం చేశారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడికి ఎటువంటి గాయం కాకుండా చాలా జాగ్రత్తగా అల్యూమినియం పాత్రను ఒక వైపు నుండి కట్ చేశారు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు బాలుడు భయపడకుండా ఉండటానికి ఒక అధికారి అతనికి నీళ్లు తాగిస్తూ, మాటలతో ధైర్యం చెప్పారు. దాదాపు అరగంట పాటు శ్రమించి పాత్రన్ కట్‌చేసి అధికారులు సురక్షితంగా బాలుడిని బయటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ ఘటన సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసి నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడా ప్లేస్‌ లేనట్టు అందులో ఎందుకు కూర్చున్నావ్‌రా అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. ఇంట్లో ఉన్న ఛేర్స్ కన్నా.. ఆ పాత్రే కూర్చోవడానికి బాగున్నట్టుందని మరో యూజర్ ఫన్నీగా కామెంట్ చేశారు. అయితే ఇంట్లో చిన్న పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ మరో యూజర్ కామెంట్ చేశాడు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us