
పులులు, కొండచిలువలు రెండూ ప్రమాదకరమైన జీవులు. జంతువులు ఆకలిగా ఉన్నప్పుడు వేటాడటం చూడటం ఆనందంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు వాటి ఆహారం కూడా ప్రాణాంతకం కావచ్చు. దీనికి స్పష్టమైన ఉదాహరణ ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో జరిగిన సంఘటన. పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో ఆకలితో ఉన్న పులి ఒక కొండచిలువను తినేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలా ఆకలిగా ఉన్న పులి ఎదురుగా కనిపించిన ఎరను వెంటనే తినేసింది..ఆకలి తీర్చుకునే ఆనందంతో ఆ పులి ఏకంగా కొండ చిలువ పామును తినడం ప్రారంభించింది. కానీ, దానిని తిన్న కొంత సమయం తరువాత పులి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. అది తిన్న ఆహారాన్ని వెంటనే వాంతి చేసుకుంది. వాంతులు చేసుకున్న తర్వాత కడుపు నొప్పి తగ్గకపోవడంతో పులి సమీపంలోని గడ్డిని తినేసింది. కొండచిలువను తిన్న తర్వాత పులి ఇబ్బందుల్లో పడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
शेर या बाघ को कभी घास खाते न देखा हो तो आज देख लीजिये-
पीलीभीत टाइगर रिजर्व में अजगर खाने के बाद असहज हुआ बाघ,उलटी करता नजर आया,
पीलीभीत टाइगर रिजर्व में अजगर खाने से असहज हुआ टाइगर
उलटी करने के बाद बाघ दिखा बेचैन, बेचैनी की हालत में घास खाता दिखा बाघ,
पर्यटकों ने अपने मोबाइल… pic.twitter.com/HGmse4H6Ta
— ऋषभ त्यागी (वशिष्ठ) (@RISHABH79RAAZ) April 18, 2025
ఈ వీడియో @RISHABH79RAAZ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. వందలాది మంది దీనిని వీక్షించారు. కొండచిలువ తినేసిన తర్వాత పులి అస్వస్థతతో ఇబ్బంది పడుతున్న దృశ్యం గురించి చాలా మంది రకరకాలుగా వ్యాఖ్యానించారు .
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..