
గుజరాత్‌లోని అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కదులుతున్న వందేభారత్ ట్రైన్ ఎక్కబోయిన టీసీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న వందేభారత్ ట్రైన్ ప్లాట్‌ఫాం నుంచి కదులుతోంది. ఆ సమయానికి ఆ రైల్లో విధులు నిర్వహించాల్సిన టీసీ పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అప్పటికే ఆ ట్రైన్ తలుపులు పాక్షికంగా ముసుకుపోయాయి. రైలు వేగం పుంజుకుంటోంది. ఈ క్రమంలోనే ఆ టీసీ ఎలాగైనా ట్రైన్ ఎక్కాలని భావించాడు. రైలు ఆపాలని క్యాబిన్‌లో ఉన్న లోకో పైలట్ సైగలు చేశాడు. అలానే రైలు వెంట పరిగెత్తాడు.
సగం మూసుకుపోయిన తలుపుల ద్వారా లోపలికి ఎక్కేందుకు యత్నించి విఫలమయ్యాడు. మరో విషయం ఏంటంటే ఆ ఫ్లాట్‌ఫాం తడిగా ఉంది. దీంతో అతను అదుపుతప్పి కిందపడిపోయాడు. అయితే చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడ్ని పక్కకు లాగారు. ఒకవేళ అతడు రైలుకు, పట్టాల మధ్య ఇరుక్కుపోయినట్లైతే ప్రాణాలకే ప్రమాదం ఉండేది. జూన్ 26 న ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటీజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Video | Gates of Mumbai bound Vande Bharat closed at Ahmedabad station & a Ticket checker was left out. Desparate to get in, he attempted something that may have cost him his life. This is reported to have happened on 26th June. #Vandebharat #Mumbai #IndianRail pic.twitter.com/WvzuQDGudN
— ABS (@iShekhab) June 29, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..