అప్పుడప్పుడూ మీరు సోషల్ మీడియాలో చూసే కొన్ని ఫోటోలు మీ కళ్లను మభ్యపెడుతుంటాయి. అక్కడ మనం చూసేది ఒకటయితే.. కానీ అసలుగా ఉండేది వేరొకటి. వాటిని చూసేటప్పుడు మన కళ్లే మనల్ని మోసం చేస్తుంటాయి. ఇక ఇలాంటి ఫోటో పజిల్స్‌నే ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) అని అంటారు. వీటిని ఎక్కువగా సైకాలజీ థీసిస్‌లలో ఉపయోగిస్తుంటారు. ఓ ఫోటోను ఏ దృక్కోణంలో చూస్తామో.. అది మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని వారి వివరణ. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. అలా వైరల్ అవుతున్న ఫోటోలో ఒకదాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
పైన ఉన్న ఫోటోలో మీకు ఏం కనిపిస్తోంది.? ఓ సోఫాపై ఆరుగురు యువతులు కూర్చున్నారు కదూ.! కానీ ఒక్కసారి తీక్షణంగా ఫోటోను చూస్తే మీ కళ్లు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. అదేంటంటే.. అక్కడ ఆరుగురు యువతులు ఉంటే.. కేవలం ఐదు పెయిర్స్ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.
కచ్చితంగా ఉంటాయి.. మరి ఎక్కడున్నాయి.. మీరు కనిపెట్టగలరా.? నిశితంగా ఫోటోను పరిశీలిస్తే.. మీరు ఈ పజిల్ సాల్వ్ చేసేయగలరు. ఒకవేళ మీకు కూడా సమాధానం దొరక్కపోతే.. క్రింద ఫోటోను చూడండి..
Here is the answer.. pic.twitter.com/VodIVpLxQ4
— telugufunworld (@telugufunworld) April 7, 2022