Viral Video: ఇంత ఖరీదైన బైక్‌పై వచ్చి.. చీప్‌గా అలాంటి దొంగతనం చేశాడేంటి? వీడియో చూస్తే షాక్

|

Mar 25, 2024 | 4:43 PM

దేశంలో ఏదో ఒకచోట ప్రతినిత్యం దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కో దొంగతనం ఒక్కో స్టైల్ లో జరుగుతుంటుంది. అందులో చిన్న చిన్న దొంగతనాలు కొన్నయితే, మరికొన్ని భారీ దొంగతనాలు ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు తరుచు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని దొంగతనాల సంఘటనలు చాలా ఫన్నీగా ఉంటాయి.

Viral Video: ఇంత ఖరీదైన బైక్‌పై వచ్చి.. చీప్‌గా అలాంటి దొంగతనం చేశాడేంటి? వీడియో చూస్తే షాక్
Viral Video
Follow us on

దేశంలో ఏదో ఒకచోట ప్రతినిత్యం దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కో దొంగతనం ఒక్కో స్టైల్ లో జరుగుతుంటుంది. అందులో చిన్న చిన్న దొంగతనాలు కొన్నయితే, మరికొన్ని భారీ దొంగతనాలు ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు తరుచు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని దొంగతనాల సంఘటనలు చాలా ఫన్నీగా ఉంటాయి. వాటిని చూసి నవ్వుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు. అలాంటి ఫన్నీ దొంగతనం ఒకటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత భలే దొంగ అని కామెంట్లు చేస్తారేమో..

అదొక మార్కెట్.. ప్రధాన రహదారి పక్కనే ఉంది. అనేక రకాల పండ్ల బండ్లు ఉన్నాయి. ఎవరి పనుల్లో వారు ఉండగా KTM బైక్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వెనుక కూర్చున్న ఓ యువకుడు ద్రాక్షపండ్లను తీయడానికి ప్రయత్నిస్తాడు. అయితే బైక్ నడుపుతున్న వ్యక్తి ముందుకు డ్రైవ్ చేయడంతో వెనుక కూర్చున్న యువకుడు మాత్రం ద్రాక్ష పండ్ల గుత్తిని చేతిలో పట్టుకొని అలాగే బైక్ పై పారిపోతాడు. ఏమాత్రం సిగ్గుపడకుండా ద్రాక్ష పండ్లను తింటూ కనిపిస్తాడు.

ఈ ఫన్నీ దొంగతనం వీడియో సోషల్ మీడియా ట్విట్టర్‌లో @HasnaZaruriHai అనే ఐడితో షేర్ అయ్యింది. రూ. 2 లక్షల విలువైన బైక్ ను కొనుగోలు చేయవచ్చు, కానీ రూ. 50  ద్రాక్షను కొనలేదా? అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు నెటిజన్స్. కేవలం 17 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 75 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ ఘోరంగా రియాక్ట్ అయ్యారు. ఎవరో బైక్ నడిపే వ్యక్తిని ‘మిజర్’ అని తిట్టగా, ఏం పనికిరాని వ్యక్తులు’ అంటూ కామెంట్లు చేశారు. ‘ఈ KTM కుర్రాళ్ళు మూర్ఖులు’ అని కూడా మరికొందరు తిట్టిపోశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.