టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కూడా విరాట్ కోహ్లీనే స్వయంగా దీనిని ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం విశేషం. అసలే అక్కడ రన్ మెషిన్.. ఇంకేముంది ఫ్యాన్స్ క్షణాల్లో ఆ ఫోటోపై వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటో ఏంటి.? ఎందుకంత స్పెషల్.? అనేది ఇప్పుడు చూద్దాం..
Find The Odd One Out.. Spot the Real #ViratKohli #ViratKohli #Viral #Trending #TrendingNow @TheViralFever @the_viralvideos @itsgoneviraI @WhatsTrending @TrendingWeibo pic.twitter.com/uAfteiZpvU
— telugufunworld (@telugufunworld) February 23, 2022
ఓ స్మార్ట్ ఫోన్ యాడ్ కోసం విరాట్ కోహ్లీ.. అచ్చుగుద్దిన్నట్లు తనలా ఉన్న 10 మంది వ్యక్తులతో కలిసి నటించాడు. ఆ యాడ్ చిత్రీకరణ సమయంలో వారితో కలిసి దిగిన ఓ ఫోటోను విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అందులో రియల్ విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడో కనిపెట్టాలని ఫ్యాన్స్‌కు సవాల్ విసిరాడు. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు.. అసలు ఇంతకీ అందులో రియల్ విరాట్ కోహ్లీ ఉన్నాడా.? అని డౌట్ వ్యక్తపరుస్తున్నారు. మరి మీరు కూడా ఓసారి లుక్కేయండి. అందులో విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడో కనిపెట్టండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి..
Here is the answer.. pic.twitter.com/murZqM0XFR
— telugufunworld (@telugufunworld) February 23, 2022