కత్తితో 73 సార్లు పొడిచి చంపిన మనవడు వీడియో
హైదరాబాద్ పంజాగుట్టలో దారుణ హత్య జరిగింది. ఇదేదో మామూలు మర్డర్ కాదు.. సొంత తాతనే మనవడు హత్యచేసిన ఘటన సంచలనం రేపింది. ఆస్తి కోసం ఓ మనవడు విచక్షణ కోల్పోయాడు.. డ్రగ్స్‌కి బానిసై.. సొంత తాత, ప్రముఖ పారిశ్రామికవేత్త వీసీ జనార్థన్‌రావును అతని మనవడు కీర్తితేజ 73సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు.
అడ్డొచ్చిన తల్లిని 12సార్లు పొడిచాడు.ఆస్తి కోసం జనార్థనరావును ఆయన మనవడు కీర్తితేజ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 73 సార్లు జనార్థనరావును కత్తితో పొడిచి చంపినట్లు వెల్లడించారు. కంపెనీలో డైరెక్టర్ పోస్టు ఇవ్వలేదన్న కోపంతో ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. జనార్దన్‌రావుని చంపుతుంటే అడ్డం వచ్చిన తల్లిని కూడా 12సార్లు పొడిచాడు కీర్తి తేజ. తల్లి, తాత అరుపులు విని ఇంట్లోకి వచ్చారు స్థానికులు. అయితే అప్పటికే జనార్ధన్ రావు చనిపోగా..తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న కీర్తి తేజ తల్లిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
Published on: Feb 09, 2025 11:48 PM