Viral Video: గాల్లోకి ఎగిరిన టెస్లా కారు! దీంతో ఫ్లయింగ్‌ కారు సాధ్యమే అని తేలిపోయింది!

Tesla Car: ఒక కారు రోడ్డుపై వేగంగా దూసుకెళ్లడం చూశాం.. రేసింగ్ కార్లు గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేయడం కూడా చూసి ఉంటాం. కానీ ఓ కారు తలకిందులుగా ప్రయాణించి.. ఆ తర్వాత గాల్లోకి ఎగిరి సురక్షితంగా ల్యాండ్ అయితే? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా! సరిగ్గా ఇలాంటి ఓ అద్భుతమైన విన్యాసాన్ని ప్రదర్శించింది టెస్లా కారు!

Viral Video: గాల్లోకి ఎగిరిన టెస్లా కారు! దీంతో ఫ్లయింగ్‌ కారు సాధ్యమే అని తేలిపోయింది!
Tesla Car Flies Goes Upside Down In Stunning Demo

Updated on: Oct 16, 2026 | 8:31 PM

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం స్పేస్‌ఎక్స్‌ కేంద్రంలో అక్టోబర్ 15న ఓ ప్రదర్శన జరిగింది. టెస్లా రోడ్‌స్టర్ కారు ప్రత్యేకంగా రూపొందించిన  ర్యాంప్‌పై వేగంగా దూసుకెళ్లింది. అక్కడితో ఆగకుండా ర్యాంప్‌పై తలకిందులుగా ప్రయాణించింది. ఆ తర్వాత గాల్లోకి ఎగిరి.. మళ్లీ సురక్షితంగా కిందకు దిగింది. సాధారణ కార్లతో ఇలాంటి విన్యాసాలు చేయడం దాదాపు అసాధ్యం.

ఈ కారులో స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేసిన కోల్డ్ గ్యాస్ థ్రస్టర్ల సాంకేతికతను ఉపయోగించారు. స్పేస్‌ఎక్స్ అనేది ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన, రాకెట్ ప్రయోగ సంస్థ. థ్రస్టర్ల ఒత్తిడితో నిల్వ చేసిన వాయువు బయటకు విడుదలవుతుంది.  కారును ముందుకు తోసే శక్తిని సృష్టిస్తాయి. రాకెట్లు, అంతరిక్ష వాహనాల్లో ఇలాంటి థ్రస్టర్ వ్యవస్థలను దిశను మార్చడానికి, కదలికను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఎగిరే కార్ల ఆలోచన ఆచణలో సాధ్యమేనని ఈ టెస్లా కారు నిరూపించింది.  ఈ టెక్నాలజీ వాస్తవ ప్రపంచంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రయాణికులతో కారు సురక్షితంగా ఎగరగలదా? వంటి ప్రశ్నలకు ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది.  వీడియోను స్వయంగా ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేశారు. అంతేకాదు.. భవిష్యత్తులో ఎగిరే కార్లు ఉంటాయని తేలింపోయింది అనే అర్థం వచ్చేలా కామెంట్ కూడా చేశారు

 

2017లో ప్రకటించిన కారు.. ఇంకా మార్కెట్లోకి రాలేదు!

టెస్లా నెక్స్ట్ జనరేషన్ కారును 2017 నవంబర్‌లో ప్రకటించింది. అప్పట్లోనే ఈ కారు ఆటోమొబైల్ రంగంలో భారీ అంచనాలను సృష్టించింది. అయితే ఉత్పత్తి అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ కారు ఉత్పత్తిని 2028లో ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వాణిజ్యపరంగా అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుంది.

త్వరలో మనమూ ఎగిరే కార్లలో ప్రయాణించవచ్చా?

టెస్లా ప్రదర్శన చూసిన తర్వాత చాలా మందికి కలిగే ప్రశ్న ఇదే. భవిష్యత్తులో రోడ్లపై నడిచే కార్లు గాల్లోనూ ప్రయాణిస్తాయా?
సాంకేతికంగా ఇలాంటి ప్రయోగాలు ఆసక్తికరమైన ముందడుగే కానీ ఎగిరే కార్లను సాధారణ రోడ్లపై ఉపయోగించాలంటే అనేక సవాళ్లను అధిగమించాలి.

గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన వ్యవస్థలు అవసరం. సాధారణ రోడ్లపై నడపడంతో పాటు గాల్లో ప్రయాణించేందుకు కూడా సంబంధిత అధికారుల అనుమతులు అవసరం. ప్రయాణికులతో సురక్షితంగా ఎగరడం, సేఫ్‌ ల్యాండింగ్ చేయడం ముఖ్యం. ఇలాంటి కార్ల తయారీ, నిర్వహణ ఖర్చులు ఎంత ఉంటాయి? సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయా? అనేది చూడాలి. టెస్లా ప్రదర్శనను భవిష్యత్తు రవాణా రంగంలో ఆసక్తికరమైన ప్రయోగంగా చూడవచ్చు. కానీ ఎగిరే కార్లు త్వరలోనే ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తాయని ఇప్పుడే చెప్పలేం. అయితే, రోడ్డు మీద పరుగులు పెట్టే కారును గాల్లోకి ఎగిరే వాహనంగా మార్చాలన్న ఆలోచన ఆటోమొబైల్ ప్రపంచంలో ఎప్పటినుంచో ఉంది. టెస్లా రోడ్‌స్టర్ ప్రదర్శన మరోసారి ఈ ఆలోచనపై ఆసక్తిని పెంచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us