Viral Video: చిన్నారి డ్యాన్స్‌తో గజరాజు గంతులు.. వీడియో చేసిన ఆనంద్‌ మహీంద్రా.. నెటిజన్లు ఫిదా..

సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారి అంతే అందంగా డ్యాన్స్ చేసింది. ఆలయ ప్రాంగణంలో అమ్మాయి డ్యాన్స్ చేస్తుండగా చూసిన ఏనుగు ఆనందంతో...

Viral Video: చిన్నారి డ్యాన్స్‌తో గజరాజు గంతులు.. వీడియో చేసిన ఆనంద్‌ మహీంద్రా.. నెటిజన్లు ఫిదా..
Girl Dance

Updated on: Jan 02, 2023 | 1:25 PM

Viral Video: ఆలయంలో ఏనుగు నర్తకిని ఆశీర్వదించిన దృశ్యాన్ని షేర్‌ చేశారు ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా. సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన కొద్ది సమయంలోనే వీడియో వైరల్ అవుతోంది. వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్‌లను పంచుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలోని ఓ దేవాలయంలో ఏనుగు,.. డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిని ఆశీర్వదిస్తున్న వీడియోను షేర్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో ఆలయ ప్రాంగణంలోని ఏనుగు ముందు ఓ అమ్మాయి డ్యాన్స్ చేయడం చూడవచ్చు. సంప్రదాయ దుస్తులు ధరించిన నర్తకి అంతే అందంగా డ్యాన్స్ చేసింది. అప్పుడు ఏనుగు తన ట్రంక్‌ని ఆమె తలపై ఉంచి ఆశీర్వదించడం చూడవచ్చు. ఆ అమ్మాయి డ్యాన్స్‌ చేస్తూ ఉండ‌గానే.. ఏనుగు ఆమెను ఆశీర్వ‌దించింది. తన తొండంతో ప‌లుమార్లు ఆశీర్వ‌దించిన గ‌జ‌రాజు.. తాను కూడా నృత్యం చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఇవి కూడా చదవండి

కర్ణాటకలోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో తీసిన వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ, కర్ణాటకలోని కట్ట్‌లోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం అద్భుతంగా ఉంది. ఆ గ‌జ‌రాజు మ‌నంద‌రికీ ఆశీర్వాదం ఇస్తున్న‌ట్లు తాను భావిస్తున్నాన‌ని మ‌హీంద్రా త‌న ట్వీట్‌లో క్యాప్షన్‌గా పోస్ట్ చేశాడు. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us