ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రికి.. డాక్టర్లు టెస్టులు చేయగా

Viral: ఈ మధ్యకాలంలో నిబ్బానిబ్బిలు ఏం చేస్తున్నారో.. ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. కొన్ని సంఘటనలు చూస్తుంటే.. అమ్మబాబోయ్.! ఇలా కూడా చేస్తారా అనిపిస్తుంది. ఆ కోవకు చెందిన సంఘటన ఇది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.. ఓ సారి లుక్కేయండి మరి.

ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రికి.. డాక్టర్లు టెస్టులు చేయగా
Representative Image

Updated on: Dec 19, 2025 | 12:34 PM

ఇన్‌స్టా, సోషల్ మీడియా కచ్చితంగా టీనేజర్ల మైండ్ చెడిపోయేలా చేస్తున్నాయని అనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఘటన వియత్నాంలోని హోచిమిన్‌లో జరిగింది. 16 ఏళ్ల టీనేజర్ తన మూత్రాశయంలోకి ఫోన్ చార్జర్‌ను చొప్పించుకున్నాడు. ఆపై డిసెంబర్ 7న శస్త్రచికిత్స నిర్వహించి.. విజయవంతంగా దాన్ని తొలగించారు. వింత అనుభూతి కోసం ఆన్‌లైన్‌లో వీడియోను చూసిన 16 ఏళ్ల బాలుడి.. ఫోన్ చార్జర్‌ను తన మూత్రనాళంలోకి చొప్పించుకున్నాడు. అది ఇరుక్కుపోవడంతో బాధలో మునిగిపోయి.. ఎవరికీ చెప్పలేదు.

ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!

ఇక అతడి బాధను చూసిన కుటుంబసభ్యులు కంగారుపడి.. ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు టెస్టులు చేయగా.. మూత్రాశయంలో చార్జర్‌ను గుర్తించి ఆశ్చర్యపోయారు. హుటాహుటిన ఆన్ బిన్హ్ ఆసుపత్రి వైద్యులు.. సుమారు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని తొలగించారు. మొదటిగా డాక్టర్లు ఎండోస్కోపిక్ సర్జరీ 30 నిమిషాలు కొనసాగించగా.. ఆ వైర్ శరీరంలో లూప్‌లుగా చుట్టుకుని ఉండటంతో.. ఆ ప్రక్రియ క్లిష్టం అయింది. అంతేకాకుండా మూత్రాశయంలోని కొంత భాగం దాని వల్ల కుళ్లిపోవడాన్ని డాక్టర్లు గుర్తించారు. అయితేనేం చివరికి ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. రెండు రోజుల అనంతరం సదరు బాలుడికి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి