
ఎన్నో అరుదైన, అద్భుతమైన దృశ్యాలు కళ్ల ముందుకు వస్తుంటాయి. కానీ, అది నిజమో కాదో ఇప్పటికీ నమ్మడం కష్టంగానే ఉంటుంది. అలాంటి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వీడియో చూస్తే మీరు మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా చెమటలు పట్టిస్తుంది. ఈ వీడియోలో, ఒక బాలుడు తన ఎడమ చేతిపై ఏకంగా తేనేటీగల పుట్టనే మోస్తూ తిరుగుతున్నాడు. అతడు ఎక్కడికి వెళితే.. అక్కడికి తనతో పాటుగా ఆ తేనెటీగలు కూడా మోసుకుంటూ వీధిలో నడుస్తున్న దృశ్యాలు నెటిజన్లు షాక్ అయ్యేలా చేస్తున్నాయి.
ఈ ఘటన అమెరికాలో జరిగినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం, ఈ బాలుడు తేనెటీగల పెంపకంతో తేనె వ్యాపారం చేస్తున్నాడు. అయితే తేనెటీగలు అతనికి ఇలా అంటుకోవడం నిజంగా షాకింగ్‌గా ఉంది. ఎందుకంటే తేనెటీగలు ఎవరినీ వదలవు. ఎవరు ఎలా దొరికినా దాడి చేసిన కుట్టి చంపేస్తాయి. ఆ నొప్పి భరించటం కూడా చాలా కష్టం. కొన్ని కొన్ని సందర్బాల్లో ప్రాణాలు కూడా ప్రమాదం లేకపోలేదు. కానీ, వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం యువకుడి ఎడమచేతిపై తేనెటీగలు తేనెతుట్టేనే ఏర్పాటు చేసుకున్నాయి. పైగా అతను పిడికిలి బిగించి నడుస్తుంటే.. మిగిలిన తేనెటీగలు అతని చేతికి వేలాడుతున్నాయి. అయితే దీని వెనుక కారణం ఎంటన్నది బయటపడటంతో అందరూ షాక్ అయ్యారు. ఈ తేనెటీగలు అతడు చేసిన ఒక గొప్ప ఉపాయంతో ఇలా అతని కంట్రోల్లోకి వచ్చాయని అంటున్నారు.
మీడియా నివేదికల ప్రకారం, బాలుడు తన పిడికిలిలో రాణి తేనెటీగను పట్టుకున్నాడు. అందుకే తేనెటీగలు అతనిపై దాడి చేసి ఉండవచ్చు. కానీ, తేనెటీగలు అతనికి చిన్నపాటి హాని కూడా కలిగించలేదు. అందుకు కారణం ఈ యువకుడు తేనెటీగల పెంపకం చేస్తుండటం వల్ల కావచ్చు. ప్రస్తుతం అతని వీడియో వైరల్‌గా మారగా, దానికి భిన్నమైన స్పందనలు లభిస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..