Viral: చేపలు పట్టేందుకు వెళ్లిన మహిళ అదృశ్యం.. మొసలిపై అనుమానంతో పట్టి.. పొట్ట చీల్చగా

|

Jul 24, 2022 | 3:44 PM

గత శుక్రవారం రాత్రి ఇండోనేషియాలోని నార్త్ కాలిమంటన్‌లోని నదిలో చేపలు పట్టే సమయంలో ఫాతిమా (45)పై మొసలి దాడిచేసింది. ఆపై ఆ మొసలిని పట్టి.. పొట్ట చీల్చి మహిళ డెడ్‌బాడీని బయటకు తీశారు స్థానికులు.

Viral: చేపలు పట్టేందుకు వెళ్లిన మహిళ అదృశ్యం.. మొసలిపై అనుమానంతో పట్టి.. పొట్ట చీల్చగా
Crocodile
Follow us on

Trending: ఇండోనేషియా(Indonesia)లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. నార్త్ కాలిమంటన్‌(North Kalimantan)లోని ఒక నదిలో ఫాతిమా(45) అనే ఓ మహిళ చేపలు పట్టేందుకు వెళ్లగా.. ఓ భారీ మొసలి ఒక్కసారిగా దాడి చేసింది. ఆమెను తన పదునైన దవడలతో బంధించి.. నీటి లోపలికి లాక్కెళ్లింది. ఈ క్రమంలో ఫాతిమా అరుపులు వినిపించడంతో.. దగ్గర్లో ఉన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. భారీ మొసలి ఆమెను నీటిలోకి లాక్కెళ్లిందని నిర్ధారించుకున్నారు. ఆ సమయంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి వాళ్లది. శుక్రవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఆగ్రహించిన మహిళ గ్రామస్థులు.. ఆ మొసలి ఆచూకి కోసం సముద్రాన్ని జల్లెడపట్టారు. మరుసటి రోజు 19 అడుగులు (6-మీటర్లు) పొడవైన పెద్ద మొసలిని పట్టుకున్నారు. ఆపై స్థానిక పోలీసులు ఆ మొసలిని కాల్చి చంపారు. అనంతరం ఆ భారీ మొసలి పొట్ట చీల్చగా మహిళకు సంబంధిచిన కొన్ని శరీర భాగాలు దొరికాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) ఏజెన్సీ టీమ్ చాలా గంటలు గాలించిన తర్వాత ఫాతిమా తలతో సహా ఇతర శరీర భాగాలు సముద్రంలోని మరో ప్రాంతంలో కనుగొంది.

రెస్క్యూ టీమ్ చీఫ్ అమీరుద్దీన్ మాట్లాడుతూ.. ఆ నదిలో మరిన్ని మొసళ్లు ఉండే అవకాశం ఉన్నందున సమీపంలోని నివాసితులను నదిలోకి వెళ్లినప్పుడు అప్రమత్తంగా   ఉండాలని హెచ్చరించినట్లు తెలిపారు. చేపలు పట్టే సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. (Source)

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..