Viral Video: అమ్మో ఇది మామూలు ఉడుత కాదండోయ్.. ఆ విషయంలో దీన్ని ఫాలో అవ్వాల్సిందే..!

Viral Video: ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం అని అనేక సందర్భాల్లో వింటుంటాం.

Viral Video: అమ్మో ఇది మామూలు ఉడుత కాదండోయ్.. ఆ విషయంలో దీన్ని ఫాలో అవ్వాల్సిందే..!
Squirrel
Follow us

|

Updated on: Jul 17, 2022 | 6:21 AM

Viral Video: ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం అని అనేక సందర్భాల్లో వింటుంటాం. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసూ ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా ఏ పని అయినా విజయవంతంగా చేయగలుగుతాం. అందుకే, వ్యాయామం చేయాలని సూచిస్తుంటారు నిపుణులు. చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మార్నింగ్ వాకింగ్, వ్యాయామాం, జిమ్‌కి వెళ్లడం, యోగా చేయడం వంటివి చేస్తుంటారు. తద్వారా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటారు. అయితే, ఆరోగ్యంగా ఉండటం మనుషులకే కాదు.. జంతువులకూ అవసరమే అని చెబుతోంది ఓ చిట్టి ఉడుత. అవునండీ.. ఆ ఉడుత తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉదయాన్నే లేచి యోగాసనాలు వేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ ఉడుత సూర్యోదయం వేళలో మ్యాట్‌పై పడుకుని తన ముందరి కాళ్లు, వెనుక కాళ్లు బారుగా చాచి యోగాసనాలు వేస్తోంది. రకరకాల ఆసనాలతో ఆకట్టుకుంటోంది. అయితే, ఉడుత యోగాసనాలను దాని యజమాని వీడియోలో బందించాడు. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. ఉడుత ఆసనాలను చూసి నెటిజన్లు మంత్రముగ్దులవుతున్నారు. గంటల వ్యవధిలోనే 75 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అలాగే 1.6 మిలియన్ల వ్యూస్ కూడా వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఈ బ్యూటీఫుల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..