ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు అంటే ముందు డీజే లు పెట్టి డాన్స్ లు కట్టి నానా హంగామా చేయాల్సిందే అంటున్నారు యువత. ఇప్పటికే చాలా పెళ్లిళ్లలో ఇలా డీజే మోతలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఓ పెళ్లిలో పిల్లలు చేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఎప్పుడు యువకులేనా మేము కూడా డాన్స్ చేస్తామని కొంతమంది పిల్లలు చేసిన డాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకు ఆ పిల్లలు ఏం చేశారో తెలుసా..?
ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడిది అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ వీడియోకు 11.3 వేల వీక్షణలు, 572 లైక్‌లు, వందలాది కామెంట్లు వచ్చాయి. 19 సెకన్ల క్లిప్‌లో యువకుల గుంపు డీజేకి డ్యాన్స్ చేస్తున్నారు. భోజ్‌పురి పాట ప్లే అవుతుండగా.. డ్యాన్స్ చేస్తుంటే కొందరు పిల్లలు ఖాళీ ఫుడ్ డబ్బాలు, ప్లాస్టిక్ కుర్చీలు ఎం ప్లేట్లు పట్టుకొని డాన్స్ చేశారు.
ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పాపం ఆ టెంట్ సమాన్ వాడు ఏడ్చి ఉంటాడని కొందరు రాసుకొచ్చారు. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
Girls :- yha jyade instruments nhi baj rhe hai dance nhi karungi
Meanwhile Boys :- pic.twitter.com/JN3DbHiGdl
— Ankit $8 (@imoriginalankit) December 6, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..