Trending: ప్రజంట్ తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా ఫలితాల సీజన్ నడుస్తోంది. కరోనా(coronavirus) కారణంగా ఒత్తిడి అవ్వొచ్చు.. వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు వల్ల కావొచ్చు.. కొందరు విద్యార్థలు మంచి మార్కులు తెచ్చుకోలేకపోయారు. మరికొందరు.. ఫెయిల్ అయ్యారు. అయితే ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్రంగా కలిచివేస్తుంది. ఒకసారి పరీక్షల్లో తప్పితే మరోసారి రాసుకోవచ్చు. కానీ జీవితం ఒక్కటే.. మళ్లీ తిరిగిరాదు. మిమ్మల్నే ప్రాణంగా బతుకుతున్న అమ్మనాన్నల గురించి ఆలోచించండి. చదువు మీకు రాదే అనుకోండి.. మరో రంగంలో గొప్పవాళ్లు అవ్వొచ్చు. టెన్త్ ఫెయిల్ అయి.. క్రికెట్‌లో సూపర్ స్టార్ అయ్యాడు సచిన్(Sachin Tendulkar). ఆయనలా చదువు పెద్దగా రాకపోయిన విభిన్న రంగాల్లో రాక్ చేసినవాళ్లు కోకొల్లలు. అంతెందుకు ఇంటర్ కూడా పూర్తి చేయకుండా.. ఇప్పుడు తెలుగులో ఎనర్జిటిక్ స్టార్‌గా రాణిస్తున్న హీరో రామ్ గతంలో వేసిన ఈ ట్వీట్‌ను చదవండి.
INTER RESULTS ey jeevitham anukuney na thammullaki, chellillaki..meeru jeevitham lo avvaboyedhaniki..cheyaboyedhaniki, idhi oka aa*** tho samanam…dayachesi lite thesukondi..
Itlu,
Inter kuda poorthicheyani me..
-R.A.P.O#InterBoardMurders— RAm POthineni (@ramsayz) April 23, 2019
ఇస్మార్ట్ శంకర్ తన స్టైల్లో చెప్పాడు కదా.. సో డోంట్ వర్రీ. మీ వర్రీని ఇంకాస్త తగ్గించడానికి ఓ ఆణిముత్యం రాసిన ఆన్సర్ షీట్‌ను మీ ముందుకు తీసుకువచ్చాం. అందులో హార్డ్‌వేర్‌కి, సాఫ్ట్‌వేర్‌కి డిఫరెన్స్ ఏంటో తన స్టైల్లో రాసుకొచ్చాడు ఈ క్రియేటివ్ స్టూడెంట్. హార్డ్‌వేర్ హార్డ్ అంట.. సాఫ్ట్‌వేర్ సాఫ్ట్ అంట. హార్డ్‌వేర్ అనేది డిఫరెంట్ అంట.. సాఫ్‌వేర్ కూడా డిఫరెంట్ అంట. హార్డ్‌వేర్ అనేది సాఫ్ట్ కాదట.. అలాగే సాఫ్ట్‌వేర్ అనేది హార్డ్ కాదట. అలా తనకు ఆన్సర్ తెలియకపోయినా.. తనకు నచ్చింది రాసుకుంటూ పేపర్ నింపేశాడు. చూశారుగా ఇతను కదా అసలైన జాతిరత్నం. డోంట్ వర్రీ.. బీ హ్యాపీ.. పరీక్షల్లో ఫెయిల్ అయితే లైట్ తీస్కోంది. చదువే రాకపోతే నచ్చిన రంగంలో దూసుకుపోండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి