Viral News: అమ్మ బాబోయ్‌.. పరోటా కోసం ఆర్డర్ చేశాడు.. పార్శిల్ ఓపెన్ చేసి చూడగా మైండ్ బ్లాంక్..

|

May 09, 2022 | 1:37 PM

ఓ రెస్టారెంట్‌కు వెళ్లి ఎంతో ఇష్టంగా ఫుడ్ ఆర్డర్‌ ఇచ్చాడు. ఆ పరోటా పార్శిల్ తీసుకొని ఇంటికి వెళ్లాడు. చివరకు పార్శిల్ విప్పి తిందామన్న క్రమంలో కనిపించిన ఓ జీవి చర్మం చూసి ఒక్కసారిగా షాకయ్యాడు..

Viral News: అమ్మ బాబోయ్‌.. పరోటా కోసం ఆర్డర్ చేశాడు.. పార్శిల్ ఓపెన్ చేసి చూడగా మైండ్ బ్లాంక్..
Viral News
Follow us on

Snake skin found in food: చైనా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో కప్పలు, పాముల్ని తింటారన్న విషయం మనందరికీ తెలుసు.. అలాంటి వార్తలు విన్నప్పుడు మనం వామ్మో.. ఛీ యాక్‌ అనుకుంటాం. అవన్నీ ఎలా తింటార్రా బాబు, మీరసలు మనుషులేనా.? అని తిట్టుకుంటుంటాం..అలాంటిది ఎంతో ఇష్టంగా ఫుడ్ ఆర్డర్‌ పెట్టుకుంటే.. అందులో పాము చర్మం కనిపించింది. దీంతో అవాక్కయిన సదరు కస్టమర్‌.. ఫుడ్‌ సెఫ్టీ అధికారులను ఆశ్రయించాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. కేరళ రాజధాని తిరువనంతపురం శివారు చెల్లంకోడ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సమీప హోటల్‌కు వెళ్లి పరోటా పార్శిల్ తెచ్చుకున్నాడు. ఇంటికి వెళ్లి పార్శిల్ విప్పి తిందామని చూస్తే పరోటా కంటే ముందే అతనికి చర్మం లాంటిదేదో కనిపించింది. అదేంటా అని పరిశీలనగా చూస్తే ఒక్క సారిగా షాక్ కొట్టినట్లయింది. అయితే అది పాము చర్మం. నాలుగైదు ఇంచుల పొడవున్న ఆ పాము చర్మాన్ని చూడగానే ఆయనకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అలా వదిలేస్తే ఆ హోటల్ వాళ్లు ఈ సారి పాముల్నే పంపుతారని అనుకున్నాడేమో నేరుగా వెళ్లి ఫుడ్ సేప్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఫుడ్ సేప్టీ అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే ఆ హోటల్‌లో తనిఖీలు చేశారు. కిచెన్ మొత్తం దారుణంగా ఉండటంతో వెంటనే సీజ్ చేశారు. అయితే ఆ హోటల్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని అదికారులు చెబుతున్నారు. హోటల్ కమస్టర్‌కు ఇచ్చిన పాము చర్మం ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై ఆరా తీశారు. అయితే హోటల్ వాళ్లు కూడా ఏమీ చెప్పలేకపోయారు. దీంతో ఆ కస్టమర్ ఇచ్చిన పాముచర్మంతో పాటు హోటల్‌లో స్వాధీనం చేసుకున్న తినుబండారాలు.. ఇతర పదార్థాల్ని ల్యాబ్‌కు పంపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: ఇక్కడ నేనుంటే.. అలా ఎలా పడుకుంటావ్..! గాఢ నిద్రలో ఉన్న కుక్కను లేపిన తాబేలు.. చివరకు ఊహించని షాక్

Fruits for Arthritis: కీళ్ల నొప్పులతో అల్లాడుతున్నారా..? అయితే మూడు పండ్లను తప్పనిసరిగా తినండి..

Sugarcane Juice: చెరుకు రసంలో ఇది కలుపుకొని తాగితే మొండి దగ్గు మటుమాయం.. ఇంకా మరెన్నో సమస్యలకు చక్కటి ఔషధం..