
సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే పాములు జనవాసాల్లోకి వస్తుంటాయి. వర్షాల కారణంగా అవి నివసించే బిలాల్లోకి నీరు చేరడంతో తమ నివాసాలను కోల్పోయి, సురక్షితమైన, వెచ్చని ప్రాంతాల కోసం జనవాసాల్లోకి వస్తుంటాయి. తాజాగా ఇలాగే గ్రామంలోకి వచ్చిన ఓ పాము ఎక్కడా స్థలం లేనట్లు రోడ్డు పక్కన పార్క్ చేసిన ట్రాక్టర్ టైర్‌లోకి దూరింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారోలో వెలుగు చూసింది.
ట్రాక్టర్ యజమాని వాహనాన్ని తీసేందుకు వచ్చి స్టార్ట్ చేయగా.. ఆ శబ్దానికి ఒక్కసారిగా పాము టైర్ నుంచి బయటకు వచ్చింది. అది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ ఏమైందోనని దిగి చూశాడు. టైర్ రంధ్రంలో పాము కనిపించడంతో షాకైన డ్రైవర్ వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు.
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగాడు. అయితే ఆ పాము స్నేక్ క్యాచర్‌కు సైతం చుక్కలు చూపించింది. దాన్ని పట్టుకోవడానికి వెళ్లగా చాలా కోపంగా ఆయన వైపు చూస్తూ బుసలు కొట్టడం ప్రారంభించింది. సుమారు అరగంట పాటు శ్రమించి స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా, ధైర్యంగా దానిని బయటకు తీశాడు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశాడు.
అక్కడే ఉన్న స్థానికులు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
వీడియో చూడండి..
స్నేక్ క్యాచర్ సూచనలు:
ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజలకు స్నేక్ క్యాచర్ కొన్ని సూచనలు చేశాడు. వర్షాకాలంలో పాములు తమ నివాసాలు కోల్పోయి గ్రామాల్లోకి వస్తుంటాయని.. వెచ్చదనం కోసం లారీలు, కార్ల టైర్లు, ఇంజన్ భాగాలను సురక్షిత ప్రాంతాలుగా భావించి అందులోకి దూరుతుంటాయని తెలిపాడు. గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలను స్టార్ట్ చేసే ముందు లేదా ప్రయాణం ప్రారంభించే ముందు టైర్లు, ఇంజన్ కింది భాగాలను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించాడు. ఒకవేళ పాము కనిపిస్తే సొంతంగా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా వెంటనే స్నేక్ రెస్క్యూయర్‌కు సమాచారం అందించాలని కోరాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.