Viral Video: గోడ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని బద్దలు కొట్టి చూడగా మైండ్ బ్లాంక్!

హర్యానాలో షాకింగ్ ఘటన జరిగింది. ఫతేహాబాద్‌లోని తోహానా ప్రాంతంలో ఓ ఇంట్లోలోకి పాము దూరింది...

Viral Video: గోడ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని బద్దలు కొట్టి చూడగా మైండ్ బ్లాంక్!
Snake In Wall

Updated on: Jul 18, 2022 | 8:45 PM

హర్యానాలో షాకింగ్ ఘటన జరిగింది. ఫతేహాబాద్‌లోని తోహానా ప్రాంతంలో ఓ ఇంట్లోలోకి పాము దూరింది. వెంటనే పాము గమనించిన ఇంట్లో వాళ్లు.. భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసి స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. భయంతో పాము గోడపై వెళ్లి అక్కడ ఉన్న రంధ్రంలో దూరిపోయింది. పామును బైటకు తీయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అది గోడ రంధ్రలో దూరిపోయిది. ఇక లాభంలేదని ఇంటి వారు.. గోడను పగల గొట్టడానికి సిద్ధపడ్డారు. ఇంట్లోని గోడలను కూల్చి మరీ ఆ పామును పట్టుకున్నారు. అనంతరం ఓ డబ్బాలో బంధించి, అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.