
పాము అంటేనే చాలా మందికి భయం. అది కనబడితేనే పరుగులు తీస్తారు. కొందరైతే పాము ఫోటో లేదా వీడియో కనిపించినా హడలిపోతారు. నిత్యం పాములు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఒక పెద్ద పాము చిన్న పామును పూర్తిగా మింగేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో అడవిలో తీసినట్టు కనిపిస్తోంది. ఆకుల మధ్య ఓ చిన్న పాము నెమ్మదిగా కదులుతుంటే… అక్కడికి ఓ నల్లటి పెద్ద పాము వచ్చి ఒక్కసారిగా దానిపై దాడి చేస్తుంది. ఎంత ఆకలితో ఉందో ఏమో సెకన్ల వ్యవధిలో.. ఆ చిన్న పామును కరకరా నములుతూ తినేసింది.
పాము మరో పామును తినడం ఆశ్చర్యకరంగా ఉంది కదా! చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. చాలా అరుదుగా కనిపించే ఈ దృశ్యం ప్రస్తుతం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ వీడియో చూసినవాళ్లలో కొందరు.. ‘‘వీడియో తీసేవాడు దాన్ని కాపాడొచ్చుకదా!’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ‘‘ఇలాంటి పాములు కూడా ఉంటాయా?’’ అంటున్నారు.
వీడియో దిగువన చూడండి….
It's a snake eat snake world, kids! pic.twitter.com/uI047dH6U6
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 15, 2025