Viral Video: నాగుపామును తొక్కిపట్టి నార తీసిన ముంగిస.. వీడియో చూస్తే స్టన్

పాముతో జరిగే పోరాటంలో చాలా సార్లు ముంగిసదే పైచేయి ఉంటుంది. చాలా కొద్ది సమయాల్లో మాత్రం పాము నెగ్గుతుంది. పాముతో గొడవలో ముంగిస చాలా అలర్ట్ గా ఉంటుంది. కాటు పడకుండా వీలయినంతగా తప్పించుకుంటుంది. మితంగా విషం శరీరంలో ప్రవేశించినా గ్లైకో ప్రోటీన్ ఉత్పత్తి చేసుకోవటం ద్వారా ప్రాణాపాయం నుండి గట్టెక్కుతాయి.

Viral Video: నాగుపామును తొక్కిపట్టి నార తీసిన ముంగిస.. వీడియో చూస్తే స్టన్
Snake Vs Mongoose

Updated on: Apr 11, 2024 | 10:46 AM

జంతువుల వింత ప్రపంచం తరచుగా సాధారణ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ ఏ జంతువుపై.. ఎప్పుడు ఏ జంతువు విజయం సాధిస్తుందో ఎవరికీ తెలియదు. తమ పిల్లల జోలికి వచ్చినప్పడు బలహీనమైన జంతువులు కూడా పులులు, సింహాలపై తిరగబడిన వీడియోలు  వైరల్ అవుతూ ఉంటాయి. ఇక బద్ధ శత్రువులైన పాము, ముంగిస మధ్య పోరుకు సంబంధించిన ఫైట్స్ కూడా సోషల్  మీడియాలో బాగా సర్కులేట్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ముంగీస, నాగుపాము.. ఒకే గొయ్యులో పోట్లాడుకుంటున్నాయి. రెండూ.. ఒకదాన్ని ఒకటి గాయపరుచుకున్నాయి. అయితే ముంగిస ఈ ఫైట్‌లో పై చేయి సాధించింది. వీడియోలో ముంగిస పామును తొక్కిపట్టడం మీరు చూడవచ్చు. అందుకే సోషల్ మీడియాలో దీన్ని చూసిన జనాలు మరింత షాక్ అవుతున్నారు.  ఈ వీడియో X హ్యాండిల్ @TheBrutalNatureలో షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వందలాది మంది యూజర్స్ కామెంట్ చేశారు.

వీడియో చూడండి…

 

పాము కాటేసినా ముంగిస ఎందుకు చావదు?

పాము, ముంగిస ఎప్పుడు ఎదురుపడ్డా ఫైట్ చేస్తూనే ఉంటాయి. అయితే పాము కాటు వేసినా ముంగిసకు ఎందుకు చావదు అనే డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది. ముంగిసలో రోగనిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ముంగిసలోని ఎసిటైల్ కోలిన్ గ్రాహకాల ముందు పాము పాయిజన్ పెద్దగా పని చేయదు. విషం కొద్ది పరిమాణంలో ముంగిస శరీరంలోకి వెళ్లినా.. గ్లైకో ప్రోటీన్ ఉత్పత్తి చేసుకోవటంతో ముంగిస మనుగడ సాగించగలదు. అయితే ఎక్కువ పరిమాణంలో విషం లోపలికి వెళ్తే మాత్రం ముంగిస మరణిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి