Viral Video: అమ్మ కష్టం తెలిసిన స్మార్ట్ బాయ్.. ఈజీగా, అందంగా బట్టలు మడతబెడుతున్న వీడియో వైరల్..

|

Feb 17, 2022 | 4:18 PM

Viral Video: ప్రస్తుత జనరేషన్ పిల్లలు మంచి తెలివి తేటలు గలవాళ్ళు అని పలు సందర్భాల్లో రుజువు అవుతూనే ఉంది. సరిగ్గా ఊహ కూడా తెలియని చిన్నారులు, స్మార్ట్ ఫోన్లను , ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ ను..

Viral Video: అమ్మ కష్టం తెలిసిన స్మార్ట్ బాయ్.. ఈజీగా, అందంగా బట్టలు మడతబెడుతున్న వీడియో వైరల్..
Video Viral
Follow us on

Viral Video: ప్రస్తుత జనరేషన్ పిల్లలు మంచి తెలివి తేటలు గలవాళ్ళు అని పలు సందర్భాల్లో రుజువు అవుతూనే ఉంది. సరిగ్గా ఊహ కూడా తెలియని చిన్నారులు, స్మార్ట్ ఫోన్లను , ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ ను ఎంతో అనుభవం ఉన్నవారిలా ఉపయోగిస్తున్నారు.. కొంతమంది చిన్నారులు చేసే క్యూట్ క్యూట్ పనులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. వారి తెలివి తేటలు అబ్బురపరిచేవిగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఆ వీడియోలు చూడాలనిపించేవిగా ఉంటాయి. తాజాగా ఓ చిన్నారి బాలుడు.. తన బట్టలను తానే మడత పెట్టుకుంటున్నాడు. అయితే అందరిలా చేతులతో మడతపెట్టుకుంటే.. ఇప్పుడు మనం చెప్పుకునే అవసరం ఉండేది కాదు… ఆ బాలుడు చాలా స్మార్ట్ గా అలోచించి.. బట్టలను ఈజీ అందంగా ఒద్దికగా మడత పెడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుమారు ఐదేళ్ల వసున్న బాలుడు తన టీ షర్ట్స్ ను తానే మడత పట్టుకుని.. అమ్మకి పనికి సాయం చేస్తున్నాడు. ఆ షర్ట్స్ ను మడత పెట్టడానికి ఒక అట్ట పెట్టె ముక్కను సాయం తీసుకున్నాడు. అట్ట పెట్టె లో మూడు భాగాలున్న పార్ట్ ను తీసుకున్నాడు. అది మధ్య పార్ట్ కొంచెం పెద్దదిగా.. అటు ఇటు రెండు భాగాలు చిన్నవిగా సమానంగా ఉన్నాయి. ఈ బాలుడు తన టీ షర్ట్ ను తీసుకుని ఆ అట్ట పెట్టె ముక్క మీద పెట్టి.. దానిని క్లోజ్ చేస్తున్నాడు. అంతే.. ఆ షర్ట్ అందంగా ఫోల్డ్ అయిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అలా తన షర్ట్స్ ను తానె మడతబెట్టుకున్నాడు ఈ చిన్నారి బాలుడు.. ప్రస్తుతం ఈ వీడియోకి నెటిజన్లతో పాటు.. అమ్మలు ఫిదా.. స్మార్ట్ బాయ్.. అమ్మ కష్టాన్ని తెలుసుకుని ఈజీగా తన పని తాను చేసుకుంటున్నాడు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:   వైద్య చరిత్రలో మరో అద్భుతం.. స్టెమ్‌ సెల్స్‌తో.. ఎయిడ్స్‌ పూర్తిగా నయం..