Viral Video: ‘మందగా ఉంటే ఆ బలమే వేరప్పా’… సింహాన్ని చీల్చి చెండాడిన గేదెలు.. స్పాట్ డెత్

|

Apr 14, 2021 | 7:12 PM

మీలో చాలా మంది సింహాల వేటను చూసారు. అలాంటి  వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక అడవికి రాజు అయిన సింహం పంజా పవర్ గురించి...

Viral Video:  మందగా ఉంటే ఆ బలమే వేరప్పా...  సింహాన్ని చీల్చి చెండాడిన గేదెలు.. స్పాట్ డెత్
Buffaloes Attack Lion
Follow us on

మీలో చాలా మంది సింహాల వేటను చూసారు. అలాంటి  వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక అడవికి రాజు అయిన సింహం పంజా పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి ఉన్న ఏరియాలోకి ఏ జంతువు వెళ్లడానికి సాహసించదు. ఒకవేళ వెళ్లినా బ్రతుకు జీవుడా అంటూ పరుగు లంఖించుకుంటుంది. సింహం గర్జన వినిపించింది అంటే మిగతా జంతువలు అన్నింటికి వణుకు పుడుతుంది.  కానీ సింహాన్ని మూకుమ్మడిగా దాడి చేసి వేరే జంతువులు చంపిన ఇన్సిడెంట్ ఎప్పుడైనా చూశారా..?. రోమాలు నిక్కబొడిచే అటువంటి వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇందులో ఒక గేదెల మంద సింహాన్ని వధించింది. ప్రజలు ఈ వీడియోను చూసి షాక్‌కు గురవుతున్నారు.

మీరు వీడియోను నిశితంగా గమనిస్తే… నది ఒడ్డున పెద్ద సంఖ్యలో గేదెలు ఉన్నాయి. అదే సమయంలో, అన్ని గేదెలు కలిసి సింహాన్ని చుట్టుముట్టాయి.  ఆ గేదెలు సింహాన్ని తమ కొమ్ములతో గాలిలో బౌన్స్ చేసి నేలమీదకు విసిరికొడుతున్నాయి. అక్కడి పరిస్థితిని గమనిస్తే.. సింహం చనిపోయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది.  ఈ వీడియోను సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో తెగ సర్కులేట్ అవుతుంది. ‘లైఫ్ అండ్ నేచర్’ అనే ఖాతాతో ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, ఈ వీడియోలోని గేదెల శైలి గగుర్పాటును కలిగిస్తుంది. ఏదైనా మందగా ఉంటే ఆ బలమే వేరప్పా అని కామెంట్లు పెడుతున్నారు దీన్ని చూసిన నెటిజన్లు.

Also Read: పురుషులే ఇలా… ఈ ఫోటో వెనుక అర్థం వేరు, పరమార్థం వేరు.. స్టోరీ చదివితే ఆ వ్యక్తులకు హ్యాట్సాఫ్ చెబుతారు

ఏపీలో 4,157 కేసులు.. భారీగా పెరిగిన మరణాలు.. వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు అత్యవసర చికిత్స