Snake Village: ఊరంతా పాములే.. కానీ ఎవ్వరినీ కరవవు.. ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా?

వర్షాకాలం సమయంలో ఇంట్లోకి ఎలుకలు, పాములు తరచూ వస్తుంటాయి. ఇవి జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. పాములు ఇంట్లో కనుక కనిపిస్తే జనాలు భయంతో వణికిపోతారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీస్తారు. లేదా వాటిని కొట్టి చంపేస్తారు. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ గ్రామంలోని గ్రామస్తులంతా పాములతో కలిసే జీవిస్తారు. వాటిని తమలో ఒకరిగా భావిస్తారు. ఇంతకూ ఆ గ్రామం ఏంటనేగా మీ డౌట్ అది తెలుసుకోవాలంటే.. ఈస్టోరీ చదవాల్సిందే.

Snake Village: ఊరంతా పాములే.. కానీ ఎవ్వరినీ కరవవు.. ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా?
Snake Village

Updated on: Jun 23, 2026 | 12:00 PM

సాధారణంగా పాము పేరు వింటనే చాలా మంది భయపడుతారు. అదే పాము కనిపిస్తే మరోసారి అటు పక్కకు రావాలంటే వణికిపోతారు. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం పరిస్థితి పూర్తి బిన్నంగా ఉంది. ఇక్కడి గ్రామస్తులంతా పాములతోనే కలిసి జీవనం సాగిస్తారు. అదే మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న శెట్‌ఫల్ అనే గ్రామం. ఇక్కడి ప్రజలు చిన్నప్పటి నుంచి పాములతోనే కలిసి జీవించడంతో వాటి ప్రవర్తన, కదలికలపై వారికి పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే వారు ఎలాంటి భయం లేకుండా వాటితోనే కలిసి జీవిస్తూ ఉంటారు. వాటిని తమ సహచరులుగా చూసుకుంటారు. స్థానిక నమ్మకాలు, ఆచారాల వల్ల ఏర్పడిన ఈ వినూత్న బంధం కారణంగానే ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.

ఈ గ్రామానికి పాములతో అంతటి బంధం ఎందుకుంది?

తరాలుగా వస్తున్న సాంప్రదాయాలు, మతపరమైన నమ్మకాల ప్రకారం ఇక్కడ ప్రజలు పాములను దైవంగా పూజిస్తారు. సాధారణంగా పాములను ప్రాణాంతకంగా భావించినప్పటికీ, ఈ గ్రామంలో వాటి ఉనికిని పవిత్రంగా చూస్తారు. అంతేకాదు వారు తమ ఇళ్లలోనే పాములు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక స్థలాలను కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో పాములు వాటికి ఇష్టం వచ్చినప్పుడు జనాల్లోని ఇళ్లలోకి వెళ్లి ఆశ్రయం పొందుతాయి. ఈ విషయంలో వాటికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హిందూ సంప్రదాయంలో పాములకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. మనుషులతో కలిసి జీవించడం వల్ల ఇక్కడి పాములు ఎవరికీ ఎలాంటి హాని చేయవని స్థానికులు నమ్ముతారు. తరతరాలుగా వస్తున్న కథలు, నమ్మకాలు వీరి జీవితంలో భాగమయ్యాయి. దేశంలోని ఇతర ప్రాంతాలలో కేవలం పండుగల సమయంలోనే పాములను పూజిస్తే, శెట్‌ఫల్ గ్రామస్థులకు మాత్రం ఇది నిత్యకృత్యంగా మారిపోయింది.

గ్రామంలోకి వెళ్లాలంటే ఈ రూల్స్ తప్పనిసరి

  • మీరు ఈ గ్రామాన్ని సందర్శించాలని అనుకుంటే, ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.
  • పాములకు ఎలాంటి హాని చేయకూడదు, వాటిని రెచ్చగొట్టకూడదు అలాగే వాటి పట్ల హింసాత్మకంగా ప్రవర్తించకూడదు.
  • పాములను పట్టుకోవడానికి లేదా తాకడానికి ప్రయత్నించకూడదు.
  • అక్కడి స్థానికులు చెప్పే సూచనలను ఖచ్చితంగా పాటించాలి.
  • వన్యప్రాణులకు ఇబ్బంది కలిగించకూడదు, అలాగే అనుమతి లేకుండా ఎవరి ఇంట్లోకి వెళ్లరాదు
  • అక్కడికి వెళ్తే భయంతో కాకుండా, పాముల పట్ల గౌరవంతో వ్యవహరించాలి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us