Watch: రైతు పొలంలో ప్రత్యక్షమైన శేషనాగు.. ఐదు తలలతో విశ్వరూపం..! వీడియో వైరల్‌..

ఆ మహా విష్ణువు శేషతల్పంపై పవళిస్తాడు. దీనిని భక్తులు పూర్తిగా విశ్వసిస్తారు. ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు ప్రజల్ని పక్కదోవ పట్టించే పనులు చేస్తుంటారు. మరోసారి ప్రజల విశ్వాసాన్ని దోచుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఫేక్‌ వీడియో వైరల్‌ అవుతోంది. ఈసారి శేషనాగ్ ఫోటోను ఉపయోగించి ఒక వైరల్‌ వీడియోని క్రియేట్‌ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. షాకింగ్‌ కామెంట్స్‌తో స్పందించారు.

Watch: రైతు పొలంలో ప్రత్యక్షమైన శేషనాగు.. ఐదు తలలతో విశ్వరూపం..! వీడియో వైరల్‌..
Fake Sheshnag

Updated on: Oct 05, 2025 | 7:24 PM

మత విశ్వాసాలను ప్రేరేపిస్తూ ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. సోషల్ మీడియా దీనికి ఒక వేదికగా మారింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలోని ఒక పొలంలో కనిపించిన భారీ శేషనాగ్ వీడియో వైరల్ అయ్యింది. విష్ణుమూర్తి నవగ్రహాలకు నిలయమైన శేషనాగుపై శయనిస్తాడని భక్తుల విశ్వాసం. అలాంటి శేషనాగు..పొలంలో గుడ్లను కాపాడుతున్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తుంది.

వైరల్‌ వీడియోలో ఒక పెద్ద ఆకుపచ్చ-నలుపు పాము పెద్ద ఎత్తున పడగ విప్పి ఉంది. పొలంలోని మట్టిలో ముడుచుకుని దాని చుట్టూ తెల్లటి గుడ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో అత్యధికంగా షేర్ చేయబడింది. ఈ వీడియోకు లక్షలాది వ్యూస్‌, షేర్లు వచ్చాయి. అయితే, నెటిజన్లు సైతం తెలివైనవారే.. ఎందుకంటే.. ఈ వీడియో ఫేక్ అని నిర్ధారించారు. దీనిపై స్పందిస్తూ..ఇది శేషనాగ్ దర్శనం, అతన్ని పూజిద్దాం!” అని రాశారు.. కానీ, చాలామంది చాలా రకాల సందేహాలు వ్యక్తం చేశారు. ఇదంతా ఫేక్‌ అని కొట్టి పడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఇకపోతే, ఈ వీడియో 2023 నాటిదిగా తెలిసింది. దీనిలో ఒక సాధారణ కోబ్రా పొలంలోకి ప్రవేశించింది. మిడ్‌జర్నీ వంటి AI సాధనాలను ఉపయోగించి, పామును భారీగా చేసి, గుడ్లను డిజిటల్‌గా యాడ్‌ చేశారు. ఇది డీప్‌ఫేక్‌కు సంకేతం అని చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యనించారు. ఒక సైబర్ నిపుణుడు మాట్లాడుతూ, ఈ వీడియోలు ప్రజల్లో గందరగోళాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా వన్యప్రాణుల గురించి అపోహలను కూడా సృష్టిస్తాయని చెప్పారు. కోబ్రా పాము గుడ్లను కాపాడుతుంది. గుడ్లు కాదు, కానీ శేషనాగ్ లాంటి అద్భుతం అసాధ్యం అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..