జంతువులు, జలచరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చనువు ఇచ్చాయి కదా అని ఓవర్ యాక్షన్ చేస్తే మన ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే. దీనికి అడ్డం పట్టే విధంగా ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. సముద్రంలోని ఓ పడవలో ఒక ఫ్యామిలీ తమ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అంతలో అనుకోని అతిధిలా ఆ ఫ్యామిలీని చిన్న సొరచేప(షార్క్) వచ్చి పలకరిస్తుంది. చిన్నదైనా.. పెద్దదైనా.. షార్క్ ప్రమాదకరమైన జలచరం.. దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ షార్క్‌తో ఓవర్ యాక్షన్ చేశాడు పడవలోని వ్యక్తి. అంతే! సొరచేపకు తిక్కరేగిపోయింది. ఒక్కసారిగా అతడి చేతిని నోటితో గాయపరిచింది. ఈ క్రమంలోనే సొరచేప పళ్లకు రక్తం ఉండటం.. అతడి వేలికి గాయం కావడం మీరు వీడియోలో చూడవచ్చు.
we would’ve had shark steaks the same night ? pic.twitter.com/GDKZCCUgTC
— SourPatchB? (@ButtahCuupB) July 20, 2022
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.