Viral: వీర్యం కూడిన కండోమ్స్ తీసుకురావాలన్న స్కూల్ టీచర్.. కట్ చేస్తే.. చివరికి ఏం జరిగిందో తెలుసా!

ఆమె ఓ స్కూల్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పే ఆమె.. వివాదాస్పదమైన హోంవర్క్ ఇచ్చి.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

Viral: వీర్యం కూడిన కండోమ్స్ తీసుకురావాలన్న స్కూల్ టీచర్.. కట్ చేస్తే.. చివరికి ఏం జరిగిందో తెలుసా!
Condoms

Updated on: Aug 27, 2022 | 1:45 PM

ఆమె ఓ స్కూల్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పే ఆమె.. వివాదాస్పదమైన హోంవర్క్ ఇచ్చి.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. సదరు టీచర్ ఇచ్చిన హోంవర్క్‌కు తల్లిదండ్రులు మండిపడ్డారు. ఆమె ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన బోల్వియాలో చోటు చేసుకుంది. ఇంతకీ అసలు కథేంటంటే..!

వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ అమెరికాలోని బోల్వియాకు చెందిన మరియా ఐనెస్ అనే మహిళ.. ఓ హైస్కూల్‌లో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే పిల్లలకు ఓ హోంవర్క్ ఇచ్చింది. అదేంటంటే..! వీర్యం నిండిన కండోమ్స్‌ను స్కూల్‌కు తీసుకురావాలని చెప్పింది. ఇది పిల్లల తల్లిదండ్రులకు తెలియడంతో వారంతా తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా అసలు విషయమంతా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతే! ఉన్నతాధికారులు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.

కాగా, ఈ వ్యవహారంపై స్పందించిన సదరు స్కూల్ టీచర్.. తన ఉద్దేశ్యాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారని.. వీర్యకణాలు తేమ వాతావరణంలో ఎంతకాలం జీవించగలవు అనేది ప్రాక్టికల్‌గా చూపించాలనుకున్నానని.. అంతేకాకుండా ఆ కెమికల్ గురించి విద్యార్ధులకు తెలిపి.. దూరంగా ఉండాలని చెప్పాలనుకున్నట్లు ఆమె తెలిపింది. తన ఆలోచన వెనుక ఎలాంటి తప్పుడు ఉద్దేశ్యం లేదని.. తాను నలుగురు పిల్లల తల్లినని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అటు సదరు హైస్కూల్ డైరెక్టర్ మరియా ఐనెస్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశామని.. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు.