Viral Video: ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు ఇలా..

సుమత్రా దట్టమైన అడవుల్లో అరుదైన రాఫ్లేసియా హాసెల్టి పువ్వును పర్యావరణవేత్త డెకీ, అతని బృందం కనుగొన్నారు. 13 ఏళ్ల నిరీక్షణ, 23 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ అద్భుత దృశ్యం కనిపించడంతో డెకీ ఆనందంతో ఏడ్చేశాడు. ఈ అరుదైన పుష్పం వికసించడం ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది.

Viral Video: ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు ఇలా..
Rarest Flower

Updated on: Dec 05, 2025 | 5:39 PM

మన జీవితంలో ఏదైనా సాధించినప్పుడు, మనం ఎదురుచూస్తున్నది లేదా మనకు అసాధ్యం అనిపించినప్పుడు అది ఒక షాకింగ్‌గా అనిపిస్తుంది.. సోషల్ మీడియా సంచలనంగా మారిన పర్యావరణవేత్తకు సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది. సుమత్రాలోని దట్టమైన వర్షారణ్యాలలో డెకి అని పిలువబడే పర్యావరణవేత్త సెప్టియన్ ఆండ్రి సడెన్‌గా తన మోకాళ్లపై కూర్చుని ఏడవటం మొదలుపెట్టాడు..కానీ దుఃఖంతో కాదు. అతని కన్నీళ్లు ఆనందం, ఉపశమనం, ప్రకృతి పట్ల భక్తితో నిండి ఉన్నాయి. అతను తన జీవితంలో ఎక్కువ భాగం అడవుల్లో చూడటానికి ప్రయత్నించిన అరుదైన దృశ్యం అతని ముందు కనిపించింది. అది నిజంగానే అరుదైన ఒక పువ్వు రాఫ్లేసియా హాసెల్టి వికసించడం.

ఇది ఒక దశాబ్దానికి పైగా అడవిలో ఏ మానవుడు చూడని అపురూప పుష్పం. డెకి, అతని బృందానికి స్థానిక రేంజర్ నుండి అడవిలో ఒక అరుదైన మొగ్గ కనిపించిందని సమాచారం అందింది. వెంటనే ఆ బృందం అడవికి బయలుదేరింది. అది దట్టమైన అడవి పెద్ద పులులు ఎక్కువగా సంచరించే భూభాగం. కష్టతరమైన కొండలు ఎక్కాల్సి ఉంటుంది. ఫోన్ బ్యాటరీల ద్వారా 23 గంటల కష్టతరమైన ప్రయాణాన్ని చేపట్టింది. 13 సంవత్సరాల నిరీక్షణ 23 గంటల ప్రయాణం అనంతరం వారు ఎదురు చూస్తున్న ఆ క్షణం వచ్చినప్పుడు తాను చేయగలిగింది ఏడవడం మాత్రమే అని డెకి చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ చారిత్రాత్మక క్షణాన్ని ఆక్స్‌ఫర్డ్ బొటానిక్ గార్డెన్ విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్ క్రిస్ థోరోగుడ్ కెమెరాలో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కదిలిస్తోంది. కుళ్ళిన మాంసం, భరించలేని ఘాటైన వాసన కారణంగా రాఫ్లేసియాను శవం లిల్లీస్ అని పిలుస్తారు. ఈ పువ్వులు 1 మీటర్ వెడల్పు వరకు పెరుగుతాయి. 6 కిలోగ్రాముల వరకు బరువు ఉంటాయి. అయితే, ఇలాంటి రాఫ్లేసియా హాసెల్టి అత్యంత అరుదైనదిగా పరిశోధకులు చెబుతున్నారు.

డాక్టర్ థోరోగూడ్ మాట్లాడుతూ..ఇది చాలా అందంగా ఉందని చెప్పారు. తెల్లటి రేకులపై ఎర్రటి మచ్చలు ఉన్నాయి. ప్రకృతి మాత స్వయంగా దీనిని అలంకరించినట్లుగా కనిపిస్తుంది. ఈ జాతి పూల అతిపెద్ద సవాలు ఏమిటంటే… మొగ్గ అభివృద్ధి చెందడానికి 9 నెలలు పడుతుందట. కానీ ఇది కొన్ని రోజులు మాత్రమే వికసించి ఉంటుంది. సరైన సమయానికి ఇక్కడికి చేరుకోవడం అనేది గడ్డివాములో సూదిని వెతకడం లాంటిది అంటున్నారు. ఈ పువ్వు దొరికిన ప్రదేశం సుమాత్రన్ పులులు, ఖడ్గమృగాలు ఎక్కువగా నివసించే ప్రాంతం.

వెన్నెల రాత్రిలో అద్భుతం జరిగింది:

డెకి, డాక్టర్ థోరోగుడ్, రేంజర్ ఇస్వాండి ఈ పువ్వు ఉన్న ప్రదేశానికి చేరుకున్నప్పుడు అది ఇంకా వికసించలేదు. ఆ సమయంలో రేంజర్ హెచ్చరించాడు. ఇది పులి గుహ.. రాత్రివేళ ఇక్కడ సురక్షితం కాదని చెప్పాడు. కానీ డెకి వెనక్కి వెళ్లడానికి అంగీకరించలేదు. ఇంకో గంటపాటు ఇక్కడే ఉంటే ఆ మాయాజలాన్ని చూడొచ్చు అన్నాడు. పౌర్ణమివేళ చంద్రకాంతిలో పువ్వు నెమ్మదిగా దాని రేకులను విప్పడం ప్రారంభించింది. ఇదంతా చూసిన డాక్టర్ థోరోగుడ్ కూడా ఆనందించాడు. ఆ దృశ్యం నిజంగా మాయాజాలం లాంటిది అన్నారు. ప్రకృతి మన కళ్ళ ముందు ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా అనిపించిందని చెప్పారు.

వీడియో ఇక్కడ చూడండి…

డెకి దానిని ఒక బిడ్డ పుట్టుకతో పోల్చాడు. రాఫ్లేసియా తొమ్మిది నెలల జీవిత చక్రం తల్లి గర్భం లాంటిది. అది వికసించడం చూడటం మీ బిడ్డను మొదటిసారి చూసినట్లే అంటూ భావోద్వేంగా చెప్పాడు. డెకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అరుదైన పువ్వు లెక్కలేనన్ని ఫోటోలు ఉన్నాయి. వాటిని ప్రజలు ఎంతగానో లైక్‌ చేశారు. అతని పోస్ట్‌ని 14,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..