Viral Video: పిల్లలు భగవంతుని స్వరూపం అని అంటారు. పిల్లల మనసు కల్మషం ఉండదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పిల్లలకు సంబంధించిన ఏ వీడియో వచ్చినా నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పిల్లల అమాయకత్వం వారిని ఆకట్టుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చిన్నారి తనకు పాఠశాలలో ఇచ్చే హోంవర్క్ గురించి ఆందోళన చెందుతోంది. అంతేకాదు ఏకంగా తన హోమ్ వర్క్ గురించి దేశ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఎక్కడిది అన్న సమాచారం లేదు కానీ.. ఆ అమ్మాయి తన సమస్యలను చెప్పుకుంటున్న తీరు చూస్తుంటే.. స్కూల్లో ఇస్తున్న హోం వర్క్‌తో చాలా బాధపడినట్లు తెలుస్తోంది. హోం వర్క్ కారణంగా ఆటలను కూడా ఆడలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇక్కడ వీడియో చూడండి:
Viral: बच्ची ने @narendramodi से की क्यूट सी अपील pic.twitter.com/7fWyZBQzuc
— @kumarayush21 (@kumarayush084) July 23, 2022
వీడియోలో చిన్నారి మొదట తన పేరు, తన పాఠశాల పేరు చెప్పింది. తర్వాత ప్రధానికి తన సమస్యను వివరిస్తూ.. ఫిర్యాదు చేయడం ప్రారంభించింది. స్కూల్ లో తనకు చాలా హోమ్ వర్క్ ఇస్తున్నారని.. ఆడుకునే సమయం ఉండడం లేదని చెప్పింది. మేము ఎంత హోమ్ వర్క్ చేస్తున్నామో కూడా స్కూల్ వాళ్లకు తెలియదని చెప్పింది. అంతేకాదు .. స్కూల్ హోమ్‌వర్క్‌తో అమ్మ కూడా ఇబ్బంది పడుతోంది. కనుక మాకు ఎక్కువ హోమ్ వర్క్ ఇవ్వద్దని.. మేము చిన్న పిల్లలం కనుక స్కూల్ వారు అది గుర్తుంచుకుని మాకు హోమ్ వర్క్ తక్కువగా ఇవ్వాలని సూచిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ.. ప్రధాని మోడీ గారు మీరు బాలిక ఫిర్యాదుపై శ్రద్ధ వహించాలి’ అని, ‘నిజంగా పిల్లలు చిన్న వయస్సులో చాలా హోమ్ వర్క్ చేస్తున్నారు.. అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..