Viral Video: వణ్య ప్రాణులను హింసించడం చట్టరీత్య నేరం. అలా హింసించినట్లయితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అయితే వణ్యప్రాణులకు సంబంధించి చాలా వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలను చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఎక్కువగా పాములు, పులులకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోను చూస్తే షాక్‌కు గురవుతారు. ఓ వ్యక్తి భారీ పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ చేయడం వల్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ పామును తన చేతుల్లో పట్టుకుని తాడులా వాడుకుంటూ స్కిప్పింగ్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అలాగే స్కిప్పింగ్ చేస్తుండగా, ఆ పాము కాళ్లల్లో ఇరుక్కుపోవడం చూడవచ్చు. ఈ వీడియోను చూస్తుంటు గ్రామీణ ప్రాంతాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ పాము వీడియో వైరల్ అవుతోంది.
This is horrible!!! #snake pic.twitter.com/Idcd0611kf
— Diwakar Sharma (@DiwakarSharmaa) December 16, 2021