Watch: జమ్మూకాశ్మీర్‌లో అదురైన దృశ్యం.. చరిత్రలో ఎన్నడూ కనిపించని సీన్.. ఇదిగో వీడియో

చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా జమ్మూకాశ్మీర్‌లో అరుదైన టోర్నడో బీభ‌త్సం సృష్టించింది. సుమారు 10 నిమిషాలు పాటు కొనసాగినా టోర్నడో పరిసర ప్రాంత ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. జ‌నావాసాల‌కు దూరంగా అక్నూర్ ప్రాంతంలో ఈ టోర్నిడో సంభ‌వించ‌డంతో ఎటువంటి ప్రాణ ఆస్తి న‌ష్టం క‌ల‌గ‌లేద‌ని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Watch: జమ్మూకాశ్మీర్‌లో అదురైన దృశ్యం.. చరిత్రలో ఎన్నడూ కనిపించని సీన్.. ఇదిగో వీడియో
Akhnoor Tornado

Updated on: Apr 12, 2026 | 4:12 PM

సాధారణంగా జమ్మూ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, బలమైన గాలులు వీయడం సహజం. కానీ చిరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అక్నూర్ ప్రాంతంలో ఇంత పెద్ద టోర్నడో సంభవించడం స్థానిక జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద గాలి సుడిగుండంలా ఏర్పడడంతో దాన్ని చూసిన స్థానిక ప్రజలంతా తీవ్ర భాయందోళనకు గురయ్యారు. అయితే ఈ టోర్నడో జనవాసాలకు దూరంగా సంభవించడంతో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

అయితే తమ ప్రాంతంలో తొలి సారి టోర్నడోలు ఏర్పడడంతో ఈ దృశ్యాలను స్థానికులు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఆకాశం నుండి ఓ పెద్ద సుడిగాలి కిందకు వచ్చి భూమిపై ఉన్న ధూళిని, చిన్న చిన్న చెత్తాచెదారాన్ని గాల్లోకి తీసుకెళ్తున్నట్టు కనిపించే దృశ్యాలను మనం ఈ వీడియోల్లో స్పష్టంగా చూడవచ్చు.ఈ వీడియోలు చూసిన నెటిజన్లు అక్నూర్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి టోర్నడోలను తాము ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ టోర్నడోల సంభవించడంపై స్థానిక వాతావరణ శాఖ అధికారులు స్పందిస్తూ.. సాధారణంగా అమెరికా వంటి దేశాల్లో కనిపించే ఇటువంటి ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో కనిపించడం వాతావరణంలో వస్తున్న మార్పులకు సంకేతం కావచ్చు అంటున్నారు. ఈ ప్రదేశంలో మళ్లీ ఇలాంటి టోర్నడోలు ఏర్పడకపోవచ్చని.. దాదాపు 100 కిలో మీటర్ల వరకు టోర్నడోకు సంబంధించి ఎటువంటి సంకేతాలు క‌నిపించ‌డం లేద‌న్నారు. టోర్నడోలు సంభవించిన సమయంలో ప్రజలు ఎవరూ దగ్గరకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

వీడియో చూడండి..

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us