Indian Railways: రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా.. అయితే మీరు ఇవి తెలుసుకోవాల్సిందే.. లేకుంటే ఫైనే..

|

Oct 07, 2021 | 9:57 PM

రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ కొవిడ్ మార్గదర్శకాలను మరో ఆరు నెలలు పొడిగిచింది. రైల్వే ప్రాంగణం, రైళ్లలో మాస్కులు ధరించకపోతే రూ.500 వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది...

Indian Railways: రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా.. అయితే మీరు ఇవి తెలుసుకోవాల్సిందే.. లేకుంటే ఫైనే..
Passenger Trains
Follow us on

రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ కొవిడ్ మార్గదర్శకాలను మరో ఆరు నెలలు పొడిగిచింది. రైల్వే ప్రాంగణం, రైళ్లలో మాస్కులు ధరించకపోతే రూ.500 వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ ఇప్పుడు దీనిని రైల్వే యాక్ట్ కింద నేరంగా చేర్చినట్లు ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో తెలిపింది. ప్రయాణికులు ప్రయాణం ప్రారంభించేటప్పుడు వివిధ రాష్ట్రాలు జారీ చేసిన ఆరోగ్య సలహా మార్గదర్శకాలను చూసుకోవాలని భారతీయ రైల్వే ట్విట్టర్‌లో కోరింది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 22,431 కరోనా కేసులు నమోదయ్యాయని.. ఇవి నిన్న నమోదైన 18,833 కోవిడ్ కేసుల కంటే ఎక్కువ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,38,94,312 కి చేరుకుంది. మరణాల సంఖ్య 4,49,856కి పెరిగింది. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత భారతీయ రైల్వే తన సాధారణ రైలు కార్యకలాపాలను నిలిపివేసింది. కరోనా ఉధృతి తగ్గిపోవటంతో భారతదేశం అంతటా సాధారణ రైలు కార్యకలాపాలను పునప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. భారతీయ రైల్వే పశ్చిమ బెంగాల్‌కు సాధారణ రైలు కార్యకలాపాలను పునప్రారంభించాలని చూస్తోందని రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ చెప్పారు. దుర్గా పూజ, దసరా పండుగలకు ముందు ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ తగ్గట్లు కోల్‌కతాలో సబర్బన్ లోకల్ రైళ్లు, రాష్ట్ర రైళ్లను పునప్రారంభించే ప్రణాళికను రూపొందిస్తోందమని చెప్పారు. ఇందులో భాగంగా దుర్గా పూజ సందర్భంగా భారతీయ రైల్వే మరో రెండు రైళ్లను ప్రారంభించింది. కొత్త రైళ్లు సీల్డా-న్యూ జల్పాయిగురి, హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య నడుస్తాయి.

Read Also.. LPG Gas: గ్యాన్ సిలెండర్ బుక్ చేసుకోండి.. బంగారం తీసుకోండి.. పేటీఎం అదిరిపోయే ఆఫర్..వివరాలివే!