Viral Photo: కురులతో ముఖాన్ని దాచేసిన ఈ కుందనపు బొమ్మ ఎవరో గుర్తు పట్టారా.?

|

Feb 19, 2022 | 8:38 PM

Viral Photo: నటీమణులు తమ వ్యక్తిగత ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ఇటీవల సర్వసాధారంగా మారింది. ఒకప్పుడు తమ అభిమాన నటీమణుల ఫోటోలను న్యూస్‌ పేపర్‌లలో మాత్రమే చూసుకుని మురిసిపోయే అభిమానులు. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ల పుణ్యామాని..

Viral Photo: కురులతో ముఖాన్ని దాచేసిన ఈ కుందనపు బొమ్మ ఎవరో గుర్తు పట్టారా.?
Viral Photo
Follow us on

Viral Photo: నటీమణులు తమ వ్యక్తిగత ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ఇటీవల సర్వసాధారంగా మారింది. ఒకప్పుడు తమ అభిమాన నటీమణుల ఫోటోలను న్యూస్‌ పేపర్‌లలో మాత్రమే చూసుకుని మురిసిపోయే అభిమానులు. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ల పుణ్యామాని ఎప్పుడు పడితే అప్పుడు చూసుకుంటున్నారు. అంతేనా.. సోషల్‌ మీడియాలో హీరోయిన్‌లు కేవలం సినిమాలకు సంబంధించిన ఫోటోలనే కాకుండా వ్యక్తిగత ఫోటోలను కూడా షేర్‌ చేస్తున్నారు. విహార యాత్రలో సరదాగా గడిపిన మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల తార తన వెకేషన్‌కు సంబంధించిన ఫోటోను పోస్ట్‌ చేసింది. సాగరం మధ్యలో ఓడపై కూర్చున్న సమయంలో ఫోటోకు పోజిచ్చిన ఈ చిన్నది తన కురులతో ముఖాన్ని కప్పేసింది. దీంతో ఈ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన కొందరు అభిమానులు. నటీమణిని గుర్తించండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరి పైన కనిపిస్తున్న ఆ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? ఈ చిన్నది మరెవరో కాదండోయ్‌ ‘ఒక లైలా కోసం’తో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార పూజా హెగ్డే్‌. తొలి సినిమాతోనే భారీ క్రేజ్‌ దక్కించుకున్న ఈ చిన్నది, వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అత్యంత తక్కువ సమయంలోనే బడా స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లను అందుకుంటుందీ చిన్నది. ప్రస్తుతం పూజా నటిస్తోన్న చిత్రాల్లో రాధేశ్యామ్‌, బీస్ట్‌, మహేష్‌ త్రివిక్రమ్‌ సినిమాతో పాటు బాలీవుడ్‌లో ఆఫర్లు దక్కించుకొని పాన్‌ ఇండియా స్థాయిలో మెప్పిస్తోందీ చిన్నది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ దొరకడంతో ఈ చిన్నది హాలీడే ఎంజాయ్‌ చేస్తోంది. ఈ టూర్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుండడంతో అవి కాస్త వైరల్‌ అవుతున్నాయి.

Also Read: UP Elections: బుందేల్‌ఖండ్‌పై మూడు పార్టీల కన్ను.. పూర్వ వైభవం కోసం బీఎస్పీ ‘మాయ’జాలం!

Rohit Sharma: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌గా హిట్‌ మ్యాన్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన.. వైస్‌ కెప్టెన్‌ ఎవరో తెలుసా?

Anasuya: వయసు దాచుకోవాల్సిన అవసరం లేదు.. అసలు ఏజ్‌ ఎంతో చెప్పేసిన అందాల అనసూయ..