AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిటికీ దగ్గర స్టీల్ చెంచా పెడితే ఇంట్లో ఆ సమస్య ఉండదా..! ఈ వైరల్ ట్రిక్ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..

వర్షం పడినప్పుడు మీ ఇంటి కిటికీల అద్దాలపై నీటి బిందువులు చేరుతున్నాయా? గోడల మూలల్లో బూజు పట్టి ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ సమస్యకు పరిష్కారం మీ వంటగదిలోనే ఉంది.. కిటికీ గట్టుపై కేవలం ఒక స్టీల్ చెంచాను ఉంచడం ద్వారా ఈ తేమను నివారించవచ్చని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ చిన్న చిట్కా వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి? తెలుసుకుందాం..

కిటికీ దగ్గర స్టీల్ చెంచా పెడితే ఇంట్లో ఆ సమస్య ఉండదా..! ఈ వైరల్ ట్రిక్ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
Stop Window Condensation With A Spoon
Krishna S
|

Updated on: May 09, 2026 | 1:06 PM

Share

వర్షం పడిందంటే చాలు.. ఇంట్లో తేమ పెరిగిపోతుంది. ముఖ్యంగా కిటికీ అద్దాల మీద నీటి బిందువులు చేరడం, దాని వల్ల కిటికీ గట్టు తడిచిపోయి బూజు పట్టడం చాలా మందికి పెద్ద తలనొప్పి. అయితే ఈ సమస్యకు ఒక వింతైన పరిష్కారం ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. కిటికీపై ఒక స్టీల్ చెంచాను ఉంచితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ప్రచారం జరుగుతోంది. మరి ఈ చిన్న చిట్కా వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇది నిజంగా పనిచేస్తుందా? అనేది తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఆ చిట్కా ఏంటి?

ఈ పద్ధతి ప్రకారం.. ఒక ఉక్కు చెంచాను దాని కొన బయటకు కనిపించేలా కిటికీ గట్టు మీద పెట్టాలి. ఇలా చేయడం వల్ల కిటికీ అద్దాల మీద ఏర్పడే నీటి బిందువులు ఆ చెంచాకు అంటుకుని బయటకు కారిపోతాయట. తద్వారా కిటికీ గట్టు తడవదు, గోడలకు బూజు పట్టదు అని చెబుతున్నారు. గదిలోని వెచ్చని, తేమతో కూడిన గాలి చల్లని కిటికీ గాజును తాకినప్పుడు కండెన్సేషన్ ప్రక్రియ జరిగి నీటి బిందువులు ఏర్పడతాయి. విజ్ఞానశాస్త్రం ప్రకారం.. గాజు కంటే లోహం వేగంగా చల్లబడుతుంది. అందుకే గాలిలోని తేమ మొదట లోహపు చెంచాపైనే ఘనీభవిస్తుంది. దీనివల్ల నీరు కిటికీ అద్దాలపై పేరుకుపోకుండా చెంచా ద్వారా బయటకు జారిపోతుంది.

ఇది సమస్యను పూర్తిగా పరిష్కరిస్తుందా..?

ఈ పద్ధతి వల్ల నీరు ఒక దిశకు మళ్లించబడుతుందే తప్ప, గదిలోని తేమను ఇది తొలగించలేదు. అంటే మీ ఇంట్లో తేమ శాతం ఎక్కువగా ఉంటే కేవలం చెంచా పెట్టడం వల్ల ఫలితం ఉండదు. కేవలం కిటికీ గట్టు పొడిగా ఉండి, పెయింట్ పాడవకుండా చూడటానికి మాత్రమే ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది.

నిపుణులు ఏమంటున్నారు..?

అమెరికాకు చెందిన ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ఆరోగ్య నిపుణులు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలపైనే పూర్తిగా ఆధారపడవద్దని సూచిస్తున్నారు.

వెంటిలేషన్ ముఖ్యం: కిటికీలు తరచుగా తెరవడం, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడటం వల్ల గాలి ప్రసరణ పెరిగి తేమ తగ్గుతుంది.

లీకులపై దృష్టి: ఇంట్లో పైపుల లీకులు ఉంటే వెంటనే సరిచేయాలి.

ఆరోగ్య సమస్యలు: బూజు పట్టడం వల్ల అలెర్జీలు, కంటి చికాకు మరియు శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

కిటికీపై చెంచా పెట్టడం అనేది తాత్కాలికంగా కొంత ఉపశమనాన్ని ఇచ్చే చిన్న ట్రిక్ మాత్రమే. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సరైన గాలి ప్రసరణ మరియు డీహ్యూమిడిఫైయర్ వంటి శాశ్వత పరిష్కారాల వైపు చూడటమే మేలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Follow Us
కిటికీ దగ్గర స్టీల్ చెంచా పెడితే ఇంట్లో ఆ సమస్య ఉండదా..!
కిటికీ దగ్గర స్టీల్ చెంచా పెడితే ఇంట్లో ఆ సమస్య ఉండదా..!
ఈ 5 మందిని అవమానిస్తే మీ పతనం మొదలవుతుంది!
ఈ 5 మందిని అవమానిస్తే మీ పతనం మొదలవుతుంది!
రైల్వేస్టేషన్‌లో ఓ ట్రైన్‌కు ప్లాట్‌ఫామ్ ఎలా నిర్ణయిస్తారో తెల్సా
రైల్వేస్టేషన్‌లో ఓ ట్రైన్‌కు ప్లాట్‌ఫామ్ ఎలా నిర్ణయిస్తారో తెల్సా
భోజనానికి ముందు చిన్న అల్లం ముక్క తిన్నారంటే అద్దిరిపోయే లాభాలు..
భోజనానికి ముందు చిన్న అల్లం ముక్క తిన్నారంటే అద్దిరిపోయే లాభాలు..
ఈ లక్షణాలు ఉన్న పురుషుడు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టడు!
ఈ లక్షణాలు ఉన్న పురుషుడు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టడు!
అతడు కాలేజీలో నా బెస్ట్ ఫ్రెండ్.. త్రిష..
అతడు కాలేజీలో నా బెస్ట్ ఫ్రెండ్.. త్రిష..
రావణుడి కుమార్తెను విదేశాలలో అదృష్ట దేవతగా ఎందుకు పూజిస్తారు?
రావణుడి కుమార్తెను విదేశాలలో అదృష్ట దేవతగా ఎందుకు పూజిస్తారు?
ఇండియాలోని ఈ 5 ప్రదేశాలు చూస్తే యూరప్‌కి వెళ్లినట్టే ఉంటుంది..
ఇండియాలోని ఈ 5 ప్రదేశాలు చూస్తే యూరప్‌కి వెళ్లినట్టే ఉంటుంది..
హైదరాబాద్‌లో మాయమైన నీడలు.. జీరో షాడో డే స్పెషల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్‌లో మాయమైన నీడలు.. జీరో షాడో డే స్పెషల్ ఏంటో తెలుసా?
మీ భాగస్వామి మిమ్మల్ని వదిలేసి ముందు నడుస్తున్నారా? ఇది తెలుసుకో
మీ భాగస్వామి మిమ్మల్ని వదిలేసి ముందు నడుస్తున్నారా? ఇది తెలుసుకో